Advertisement
Google Ads BL

రాజమౌళి కోసం రాశి ఖన్నా, సమంత!


రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుత కళాఖండం బాహుబలి సినిమా విడుదలై వచ్చే నెల ఏప్రిల్ 28 కి సరిగ్గా ఒక ఏడాది. కానీ రాజమౌళి బాహుబలి తర్వాత తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టడానికి ఏడాదికి పైనే టైం తీసుకుంటున్నాడు. అయితే బాహబలి తదుపరి చిత్రాన్ని రాజమౌళి గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్లుగా గతంలోనే ఎనౌన్స్ చేశాడు. అయితే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడనే సమాచారం వుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ తోపాటు.... స్క్రిప్ట్ పనులను రాజమౌళి చక్కబెడుతున్నాడనే టాక్ కూడా ఉంది.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ చరణ్ లు పోలీస్ ఆఫీసర్స్ గా నటిస్తున్నారని  కూడా అంటున్నారు. అసలు ఈ సినిమా మొత్తం క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతుంది అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి హీరోయిన్స్ ని సెట్ చేసే పనిలో రాజమౌళి తలమునకలై ఉన్నాడు. మరి ఎన్టీఆర్, చరణ్ ల పక్కన నటించబోయే ఆ హీరోయిన్స్ ఎవరా అని అందరూ తెగ ఆసక్తిని పెంచేసుకుంటున్నారు. అయితే రాజమౌళి చూపు తొలిప్రేమతో హిట్ కొట్టిన వర్ష అదేనండి రాశి ఖన్నా మీద పడిందని.. రాశి ఖన్నాని ఎన్టీఆర్ కి సెట్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు తాజాగా చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్ ని కూడా రాజమౌళి సెట్ చేస్తున్నాడంటున్నారు. రామ్ చరణ్ తో ప్రస్తుతం రంగస్థలంలో జత కడుతున్న రామలక్ష్మి అదేనండి సమంతని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట దర్శక ధీరుడు. మరి రామలక్ష్మిగా సమంత రంగస్థలంలో ఎంత సక్కగున్నావే అన్నట్టుగా చిట్టి బాబు పక్కన రచ్చ రచ్చ చేస్తుంది. అందులోని అమాయకమైన ఫేస్ తో పాటే... అరమోడ్పు కన్నులతో.. అలాగే అందరిని పడేసే నవ్వుతో కనబడుతున్న సమంతని చూసి రాజమౌళి మనసులో చరణ్ పక్కన సమంత ఫిక్స్ అనుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఫైనల్ గా చరణ్ కి సమంత, ఎన్టీఆర్ కి రాశి ఖన్నా సెట్ అయ్యే సూచనలు గట్టిగా కనబడుతున్నాయంటున్నారు. 

Ram Charan and Samantha's Combo Again?:

Ram Charan and Samantha in Rajamouli's Film?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs