Advertisement
Google Ads BL

సాయిపల్లవి తెలివిగా సమాధానం ఇచ్చింది!


'ఛలో' సక్సెస్‌లో ఉన్న నాగశౌర్య నటించిన 'అమ్మమ్మ గారిల్లు'తో పాటు లైకా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా 'కరు' చిత్రం రూపొంది విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ చిత్రం తెలుగులో 'కణం'గా విడుదల కానుంది. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవల నాగశౌర్య మాట్లాడుతూ, నేను పనిచేసిన కోఆర్టిస్ట్‌లందరిలోకి సాయిపల్లవి డిఫరెంట్‌. ఆమె లోకేషన్స్‌కి సరిగా రాదు. సమయానికి రాదు. క్రమశిక్షణ లేదు. షూటింగ్‌ స్పాట్‌లో ఎంతో ఇబ్బంది పడ్డాం. 'ఫిదా' చిత్రం కేవలం సాయిపల్లవి వల్లనే రాలేదు. అది టీం సాధించిన విజయం... అని వ్యాఖ్యానించాడు. ఆయన అలా మాట్లాడిన చాలా రోజుల తర్వాత సాయిపల్లవి ఈ విషయంలో నోరు విప్పింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంది. ఇతరుల మనోభావాలను నేను గౌరవిస్తాను. 

Advertisement
CJ Advs

నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే ఎంతో బాధగా అనిపిస్తుంది నాగశౌర్యకి నాతో ఉన్న ప్రాబ్లం ఏమిటో నాకు తెలియడం లేదు..? నా గురించి ఆయన మాట్లాడిన మాటలు విని బాధపడ్డాను. దర్శకుడు విజయ్‌ గారికి ఫోన్‌ చేసి షూటింగ్‌లో నా వల్ల ఏదైనా ఇబ్బంది పడ్డారా? ఏమైనా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారా? ఎవరైనా నా గురించి ఫిర్యాదు చేశారా? ఎవరికైనా అసౌకర్యం కలిగించానా? అని అడిగాను. ఆయన అలాంటిదేమీ లేదని అన్నారు. ఈ విషయం గురించి నాగశౌర్య నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నా అదృష్టం కొద్ది ఈ విషయాన్ని నాగశౌర్య దాచలేదు. ఓపెన్‌గా చెప్పేశారు. ఓపెన్‌ కామెంట్‌ చేయడం మంచిదే... అని తెలిపింది. 

ఇక 'నేను లోకల్‌' చిత్రం సమయంలో కూడా సాయిపల్లవి వల్ల నాని ఇబ్బంది పడ్డాడని వ్యాఖ్యలు వస్తే దిల్‌రాజు ఖండించాడు. అయినా ఇంత మంది చెబుతున్నారంటే సాయిపల్లవి విషయంలో ఏదో తప్పు ఉండే ఉంటుందని అంటున్నారు.

Heroine Sai Pallavi about Naga Shaurya’s Allegations:

Finally Sai Pallavi responds to Naga Shaurya’s Allegations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs