Advertisement
Google Ads BL

శ్రియ పెళ్లి నిజంగానే.. జరగబోతుంది!


ఈమద్య సినీ నటులు తాము పెళ్లి చేసుకోవడం లేదని మీడియాకి గట్టిగా చెప్పి, ఇలాంటి వార్తలు వచ్చే మీడియాను దుమ్మెత్తిపోస్తూ మరలా అదే వివాహం చేసుకుంటున్నారు. విరాట్‌కోహ్లి, అనుష్కశర్మలు కూడా వీటిని ఖండించడం, అనుష్కశర్మ పీఏ అంతా ఉత్తి వార్తలే అని చెప్పినా వెంటనే వారి వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కోవలోకి ఇలియానా, శృతిహాసన్‌లు కూడా చేరుతున్నారు. కాగా కొన్నిరోజుల కిందట హీరోయిన్‌ శ్రీయాశరణ్‌ పెళ్లి చేసుకోనుందని అందుకే పెళ్లి కోసం షాపింగ్‌లు చేస్తోందని వార్తలు వచ్చాయి. దాంతో ఇలాంటి వార్తలు మీరెలా రాస్తారు? మీకు పని పాటా లేదా? నా జీవితంలో ఎన్నో కథలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

నేను నా ఫ్రొఫెషనల్‌ జీవితం గురించి ఏదైనా మాట్లాడేందుకు సిద్దమే. నా ప్రైవేట్‌ లైఫ్‌ని నేను సేల్‌లో పెట్టలేదు. నేను నటిని కాబట్టి సినిమాల గురించి మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. ఇక తాను కేవలం తన స్నేహితురాళ్లు ఇద్దరు ముగ్గురు పెళ్లిపీటలు ఎక్కనున్నారని, వారి కోసమే షాపింగ్‌ చేస్తున్నానని చెప్పి మండిపడింది. ఇక ఈమెది 18ఏళ్ల సుదీర్ఘకెరీర్‌. 'ఇష్టం' చిత్రం నుంచి వరుసగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతోన్న ఈమె వయసు ప్రస్తుతం 35 ఏళ్లకు పైమాటే. ఇక ఈమె త్వరలో రష్యాకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌ ప్లేయర్‌, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచిన్‌ని వివాహం చేసుకోనుంది. 

మార్చి 17, 18, 19 తేదీలలో ఈ మూడు రోజుల పెళ్లి ఘనంగా జరగనుందట. పెళ్లి మాత్రం 19వ తేదీన జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక జరుగనుందని సమాచారం. దీనిపై శ్రియా శరణ్‌ నుంచి ఎలాంటి ఖండన రాలేదు. వీరు కూడా విరుష్క తరహాలో పెళ్లి జరిగిన రోజు మాత్రమే దానిని రివీల్‌ చేస్తారని తెలుస్తోంది.

Shriya saran all set ready for marriage:

Shriya Saran Getting Ready For Marriage With Russian Boy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs