ఈనెల 24వతేదీన అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌లో తన మేనల్లుడు పెళ్లికి వెళ్లి ఆరోగ్యం బాగాలేనందు వల్ల దుబాయ్‌లోని హోటల్‌లోనే నాలుగు రోజుల ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఆమె మరణం సంభవించింది. ఇక శ్రీదేవి ఈమధ్య తనను కలిసినప్పుడు ఆరోగ్యం బాగా ఉండటం లేదని, జ్వరం, గొంతునొప్పితో పాటు కాస్త అస్వస్థతగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డితో చెప్పినట్లు పింకీ వెల్లడించింది.
ఇక తొందరపాటులో శ్రీదేవి మరిది సంజయ్‌పూర్ ఆమెది హార్ట్‌ఎటాక్ అని చెప్పడమే ఇన్ని అనుమానాలకు కారణమైంది శ్రీదేవి విషయంలో జరుగుతున్న వాదనలు, పుకార్లు అన్ని కల్పితమేనని, దుబాయ్ చట్టాల ప్రకారం ఓ కేసు విచారణలో ఉన్న సమయంలో అధికారులు ఏ విషయాన్ని ఎవ్వరికీ బయటపెట్టరు. చివరికి ఇలాంటి విషయాలలో దుబాయ్ రాజు కూడా వేలుపెట్టలేడని, అక్కడి చట్టాలు అంత కఠినంగా ఉంటాయని న్యాయనిపుణులు అంటున్నారు. కాబట్టి తెలిసితెలియకుండానే ఆమె మరణం విషయంలో ఇండియన్ మీడియాలో ఏవేవో వార్తలు వస్తున్నాయని అవి నిజం కాదని దుబాయ్ అధికారులు అంటున్నారు.
ఇక బోనీకపూర్‌ని ఇంటరాగేషన్ చేసిన విషయం గురించి ఇక్కడి మీడియాలో వార్తలు వచ్చాయని, కానీ బోనీకపూర్‌ని ఎలాంటి విచారణ చేయలేదని తెలుస్తోంది. ఇక సుదీర్ఘ దర్యాప్తు ప్రకారం దుబాయ్ ప్రభుత్వం శ్రీదేవి మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించింది. ఆమె మృతదేహం కూడా ముంబైకి చేరుకుంది. దుబాయ్ ఆరోగ్యశాఖ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగాలు సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె కేసును క్లోజ్ చేసినట్లు ప్రకటించారు. ఆమె అపస్మారక స్థితిలో, ప్రమాదవ శాత్తూ నీటిలో మునిగి చనిపోయిందని, ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని, ఈ కేసుపై భవిష్యత్తులో ఎలాంటి విచారణ ఉండదని దుబాయ్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
శ్రీదేవి బాత్రూంలో అపస్మారక స్థితిలో టబ్‌లో పడి ఊపిరాకడ మరణించిందని, ఎంబామింగ్ సర్టిఫికేట్‌లో దుబాయ్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక శ్రీదేవికి ఇన్‌ఫెక్షన్ సోకే వ్యాధులు కూడా ఏమీ లేవని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. అనంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎంబామింగ్ అంటే రసాయన పూత కార్యక్రమాన్ని జరిపి ఆమె బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతికకాయానికి బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.