Advertisement
Google Ads BL

'ఆఫీసర్'గా అదరగొడుతున్న నాగ్!


'రాజుగారి గది2' తర్వాత నాగార్జున ఎంతో నమ్మకంతో రాంగోపాల్‌ వర్మతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'శివ' చిత్రంతో దాదాపు మూడు దశాబ్దాల ముందు వీరికాంబినేషన్‌ చరిత్రను తిరగరాసి, కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. సహజసిద్దంగా ప్రవర్తించే పాత్రలు, సంభాషణలు, సీన్స్‌, కొత్త తరహా యాక్షన్‌ సీన్స్‌తో పాటు తెలుగులో సాంకేతిక విప్లవం తీసుకొచ్చి తెలుగు సినిమాని 'శివ' ముందు, తర్వాత అని విభజించేంతగా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వర్మ నాగార్జునతో 'అంతం, గోవిందా గోవిందా' చిత్రాలను చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఇంతకాలం గ్యాప్‌ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. 

Advertisement
CJ Advs

తనకు వర్మ చెప్పిన కథ అద్భుతంగా ఉందని, ఇంతకు ముందు చేయని పాత్ర, వైవిధ్యభరిత చిత్రం కావడంతోనే దీనికి ఓకే చెప్పానని నాగ్‌ అంటున్నాడు. తన చిత్రం పూర్తయ్యేవరకు ఇతర చిత్రాల జోలికి వెళ్లవద్దని చెప్పాడు. కానీ వర్మ మాత్రం అలాగే అని చెప్పి, మరలా తన దారిలో తాను జీఎస్టీ తీసి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయనకు ట్వీట్స్‌, పోలీసుల విచారణ, దేవి, మణి వంటి వారి నుంచి మహిళ సంఘాలనుంచి వ్యతిరేకత, పోలీస్‌ కేసులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 

ఇక నాగార్జున విషయానికి వస్తే వర్మ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌, షూటింగ్‌ అప్‌డేట్స్‌ని నాగ్‌ తెలుపుతూనే ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఆఫీసర్ అనే టైటిల్ తో నాగ్, వర్మ ల చిత్రం రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్, విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nagarjuna and RGV's Officer First Look out:

Officer is the RGV and Nag Movie Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs