Advertisement
Google Ads BL

ఇలియానా మాటలతో మ్యాజిక్‌ చేస్తోంది!


తెలుగులో 'దేవదాసు' చిత్రంతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత వరుసగా స్టార్స్‌ చిత్రాలు చేసిన నడుం సుందరి, గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులో నిన్నటితరం హీరోయిన్లలో ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌డోస్‌తో ఈమె రెచ్చిపోయి సైజ్‌జీరో అందాలను, సన్నని నడుంని తన ప్లస్‌ పాయింట్స్‌గా మార్చుకుంది. మొదటిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకుని సంచలనం సృష్టించింది. ఈమె తెలుగులో దాదాపు అందరి స్టార్స్‌తో నటించి, బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చింది. కానీ తర్వాత సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి జంప్‌ అయింది. తన నడుం అందాలు, సైజ్‌జీరో ఒంపుసొంపులకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అవుతారని భావించింది. ఆ తర్వాత ఆమెకి ఓ మోస్తరు చిత్రాలు వచ్చాయే గానీ బాలీవుడ్‌లో ఆమె ఆశించిన చిత్రాలు మాత్రం రాలేదు. అయినా కూడా 'జులాయి' తర్వాత తెలుగులో కనిపించలేదు. 

Advertisement
CJ Advs

ఇక ఈమె ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబ్రోన్‌తో ప్రేమలో పడింది. వారిద్దరు ఓపెన్ గా ఆ విషయం చెప్పకపోయినా కలిసి ఎంతో సాన్నిహిత్యంతో తిరుగుతూ, ఫోటోగ్రాఫర్లకు బాగానే ఫోజులిస్తూ వస్తోంది. మరోవైపు తన ప్రియుడు తనని తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తోంది. మొన్నటి క్రిస్మస్‌ సందర్భంగా తన ఫొటోలను తన ప్రియుడితో తీయించుకుని, 'ఫోటో బై హబ్బీ.. నా మనసుని ఒకరికి ఇచ్చి సగం పార్ట్‌నర్‌ని చేసుకున్నాను. మీరు కూడా మీకిష్టమై వారిని మీలో సగం చేసుకోండి..' అంటూ వ్యాఖ్యానించింది. 

సోషల్‌మీడియాలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ఎవరైనా తాము తెలుసుకోవాల్సిన విషయాలను మాత్రమే వారి ద్వారా తెలుసుకోవచ్చు. మిగిలిన విషయాలను సీక్రెట్‌గా ఉంచుకోవచ్చు. పెళ్లి నా పర్సనల్‌ విషయం. దాని గురించి దాయాల్సింది ఏమీ లేదు. అలాగే కొట్టిపారేయాల్సింది కూడా ఏమీ లేదు. మీరెన్ని అడిగినా నేను చెప్పదలుచుకున్న విషయాలను మాత్రమే చెబుతాను.. అంటూ లౌక్యంగా స్పందించి తనలో అందంతో పాటు తెలివితేటలు కూడా ఎంత ఎక్కువో నిరూపించింది ఈ మాయలేడీ...! 

Ileana Responds to Question on her Marital status with a Riddle:

Ileana reacts to post calling Andrew hubby and it might only confuse you more
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs