ఇటీవలే బాలకృష్ణ, చిరంజీవిలు తమ గాయాలకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మరోవైపు 'బాహుబలి' సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ప్రభాస్, రానాలు అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నారు. కంగనా రౌనత్ 'మణికర్ణిక' చిత్రం షూటింగ్‌లో గాయపడి, కొంతకాలం రెస్ట్ తీసుకుని, చికిత్స చేయించుకుంది. అదే ఆమె గాయాల పాలు కాకుండా ఉండి ఉంటే ముందుగా చెప్పినట్లు క్రిష్ ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేవాడు. ఇక 'శభాష్ నాయుడు' సమయంలో కమల్‌హాసన్, '2.0'లో రజనీ గాయాలపాలై చికిత్సలు తీసుకున్నారు. ఇక తాజాగా హీరో విశాల్ కూడా తీవ్రమైన భుజం నొప్పితో ఢిల్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా లాభం లేదని అమెరికాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాల్‌కి దెబ్బ తగలని షూటింగ్ లేదు. ఆయనకి షూటింగ్‌లో దెబ్బలు తగిలితే ఆ చిత్రాలు విజయం సాధిస్తాయనే సెంటిమెంట్ ఉంది.
ఇక ఇటీవల 'సాలా ఖద్దూస్, విక్రమ్‌వేద' వంటి సెలక్టెడ్ మూవీస్ చేస్తున్న నాటి లవర్ బోయ్ మాధవన్‌కి కూడా దెబ్బతగిలితే ఆపరేషన్ చేయించుకున్నాడు. తనకి భాష రాని చిత్రాలలో నటించడం కష్టమని, అలాంటివి చేయనని చెప్పే ఆయన ఎంతో బాగా కథ తన పాత్ర నచ్చడంతో ఆయన చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సూపర్ పవర్స్ ఉండే పాత్రలో నటించనున్నాడు. ఇందులో మాధవన్‌ది ఎంతో కీలకపాత్ర అని, ఇక ఆయనకు జోడీగా భూమిక నటిస్తుండగా, నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్యతో పాటు మాధవన్‌కి కూడా సూపర్ పవర్స్ ఉంటాయని, ఆయనది ఇందులో కీలకమైన ప్రతినాయకుడి పాత్ర అని చెబుతున్నారు. ఇక తాజాగా ఆయన తాను హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకున్న ఫొటోని పోస్ట్ చేస్తూ, భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఫైటర్ మరలా ట్రాక్‌లో పడ్డాడు. కుడిచేతికి స్పర్శ తెలియడం లేదని తెలిపాడు.
ఈయన పలు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పాత్ర, కథ అద్భుతంగా ఉంటే గానీ నటించే అలవాటు లేని మాధవన్ 'సవ్యసాచి'లో నటిస్తున్నాడంటే మూవీ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని అర్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత మాధవన్ నాలుగు దక్షిణాది భాషల్లో గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో నలుగురు నాలుగు భాషల హీరోలతో 'ఏ మాయ చేసావే' అనే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందనుందని సమాచారం.