Advertisement
Google Ads BL

శ్రీదేవి తలకు గాయం.. ఎలా అయ్యింది?


దేవకన్య శ్రీదేవి ఇప్పుడు కానరాని లోకానికి తరలిపోయింది. బ్రతికినన్నాళ్ళు ఎన్ని సమస్యలున్నా గుంభనంగా బ్రతికిన ఆమెకి ఇప్పుడు చనిపోయాక మాత్రం ఆమె మరణంపై అనేక రకాల అనుమానాలు వినబడుతున్నాయి. అతిలోక సుందరిగా అందరి మనసులను గెలుచుకున్న శ్రీదేవి మరణాంతరం ఆమె మరణంపై ఇలాంటి వార్తలు వినవలసి రావడం మాత్రం ఆమె మరణం కన్నా ఎక్కువగా బాధిస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు ఆ రూమర్స్ ని ఎంతగా ఖండిస్తున్నా కూడా ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. కారణం దుబాయ్ లోని శ్రీదేవి భౌతికకాయం ఇప్పటి వరకు ముంబై కి రాకపోవడమే. అక్కడ గుండెపోటుతో శ్రీదేవి మరణించిందని మొదట చెప్పినప్పటికీ ఆమె నీటిలో పడి చనిపోయిందని ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పింది. అందుకే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు శ్రీదేవి మరణం సహజ మరణమా? లేదంటే?అనే అంశం మీద దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇప్పటికే శ్రీదేవి ఉన్న హోటల్ గదిని సీజ్ చెయ్యడంతో పాటుగా.... శ్రీదేవి భర్త ని హోటల్ సిబ్బందిని ప్రశ్నల వర్షంతో దుబాయ్ పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.

Advertisement
CJ Advs

ఒకపక్క అతిలోక సుందరి దుబాయ్ మార్చురీలో అనాధ శవంలా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. అలాగే ఇప్పుడు శ్రీదేవి భర్త బోనికపూర్ అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు. మరో పక్క శ్రీదేవికి ఆల్రెడీ పోస్ట్ మార్టం అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీ పోస్ట్ మార్టం అంటున్నారు. అసలు దుబాయ్ నుండి శ్రీదేవి ఈరోజు ముంబయి కి వస్తుందా? లేదా? అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈలోపు శ్రీదేవి మరణం సహజం కాదని.. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరన్నా?అనే అనుమానాలతో పాటు శ్రీదేవి మీద 100 కోట్ల పైమాటే ఇన్సూరెన్స్ ఉందని.. అందుకే ఆమెని.... అనే అనుమానాలు ఇలా మీడియాలో నిమిషానికో వార్త ప్రచారం అవుతుంది. అసలు దుబాయ్ లో ఏం జరుగుతుందో.. తెలియదు గాని... ఇక్కడ మీడియాలో మాత్రం అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

బోనీ కపూర్ అప్పులపాలై పోయి శ్రీదేవి ఆస్తి కోసం శ్రీదేవిని ఎమన్నా చేశాడా? అసలు దుబాయ్ పెళ్లిలోనే శ్రీదేవిని బోనికపూర్ ఎమన్నా అన్నాడా? నిజంగానే బోని మొదటి భార్య బంధువులు శ్రీదేవిని ఆ పెళ్ళిలో కార్నర్ చేశారా? ఆస్తి తగాదాలు జరిగాయా? నిజంగానే బోని కపూర్ తన మొదటి భార్య పిల్లలని ఎక్కువగా అభిమానిస్తూ.. శ్రీదేవిని తన పిల్లలని నెగ్లెట్ చేశాడా? అందుకే శ్రీదేవి మనస్తాపానికి గురై రెండు రోజులు హోటల్ లోనే ఉందా? నిజంగానే బోణి కపూర్ శ్రీదేవికి సర్ప్రైజ్ పార్టీ అంటూ మద్యం తాగించాడా? ఆ మద్యం మత్తులోనే శ్రీదేవి బాత్ టబ్ లో పడి ఊపిరాడక మరణించిందా? ఆమె పేరిట ఉన్న కోట్ల ఇన్సూరెన్స్ కోసం శ్రీదేవిని ఇలా చేశారా? మరి ఈ కేసులో బోనీ కపూర్ ని దుబాయ్ పోలీస్ లు అరెస్ట్ చేస్తారా? అసలు శ్రీదేవిని ముంబై కి పంపేసి బోనీని దుబాయ్ లోనే ఉంచేస్తారా? అందుకే బోనీ పాస్ పోర్ట్ ని వారు స్వాధీనం చేసుకున్నారా?

మళ్ళీ తాజాగా శ్రీదేవి తలకు దెబ్బ తగిలిందంటూ ఒక వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీదేవి తలకు బలమైన దెబ్బ ఉందని అందుకే ఆమెకి మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేస్తున్నారనే న్యూస్ బయటికి వచ్చింది. మరి ఇలాంటి అనుమానాలు ఎన్ని ఉన్నా... ఆమె మరణానికి  ముందుగా అందరికి ఆరాధ్య దేవతలా ఒక  వెలుగు వెలిగి.. ఇలా అర్దాంతరంగా తనువూ చాలించడంతో అందరి నోళ్ళలో హాట్ టాపిక్ అవడమే కాదు... భారత దేశ ప్రజలందరి మనసుల్లో అనేక అనుమానాలను రేకెత్తించి ఆమె మాత్రం తనకేమి సంబంధం లేదన్నట్టుగా వెళ్లిపోవడం అందరిని మనసులను కలచి వేస్తుంది.

New Twist: Injury marks found on Sridevi's head:

Sridevi death: What is happening in Dubai now
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs