Advertisement
Google Ads BL

అతిలోక సుందరి చివరి సంతోష ఘడియలు అవే..!


ఆమె నటనా కెరీర్‌ 50 ఏళ్లు కావచ్చు. కానీ ఆమె వయసు మాత్రం ఇంకా 54 మాత్రమే. అంటే ఆమె చిన్నతనంలోనే మృత్యువు ఒడిలోకి వెళ్లిందని తెలుస్తోంది. తన ఫ్యామిలీ మెంబర్‌ మ్యారేజ్‌ వేడుకకు ఆమె తన భర్త బోనీకపూర్‌, చిన్నకూతురు ఖుషీతో వెళ్లింది. పెద్దమ్మాయి జాన్వి మాత్రం 'దఢక్‌' షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం, మరాఠి 'సైరత్‌'కి ఇది రీమేక్‌ కావడంతో జాన్వి కాన్‌సన్‌ట్రేషన్‌ దెబ్బతింటుందని, షూటంగ్‌కి ఇబ్బంది కలుతుందని తన పెద్దమ్మాయి జాన్విని దుబాయ్‌ వద్దని చెప్పిందట. ఇక ఈమె మరణానికి ముందు తన చిన్నకూతురు ఖుషీతో దిగిన ఫోటోలు, అతిధులు నమస్కారం చేస్తుంటే ఈమె ప్రతి నమస్కారం చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఓ అతిధిని చూసి నోటి మీద చేయి పెట్టి ఏదో చేతులతో సైగ చేస్తూ కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారు మాత్రం ఆమె పెళ్లి వేడుక వీడియోలనే ఎంతో అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉందని అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఈమె అందరు తమ గమ్యస్థానాలకు చేరితే. ఈమె మాత్రం హోటల్‌ రూంకి వెళ్లింది. అక్కడ బాత్రూంలో మరణించింది. ఇక కొన్ని చోట్ల మాత్రం ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్న వీడియో కూడా కనిపిస్తోంది. ఇక ఈమె 'మామ్‌' చిత్రం తర్వాత తన దృష్టిని అంతా తన పెద్ద కుమార్తె జాన్వి నటిస్తున్న మొదటి చిత్రం 'దఢక్‌' మీదనే పెట్టింది. సినిమాని 'సైరత్‌'ని రీమేక్‌ చేయాలని భావించడం నుంచి కరణ్‌జోహార్‌తో పాటు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తన కుమార్తెకి డ్రస్సింగ్‌, యాక్టింట్‌ వంటి విషయాలలో గైడెన్స్‌ ఇస్తోంది. 

ఇక ఈమె 'మామ్‌' తర్వాత షారుఖ్‌ఖాన్‌ కోరిక మేరకు 'జీరో' చిత్రంలో ఓ ముఖ్యపాత్రను చేయడానికి అంగీకరించిందట. ఈ పాత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కావాల్సి వుండగా, పెద్దకూతురు ఎంట్రీలో పడి ఈమె కాస్త సమయం తీసుకోవడం, అంతలోనేే ఈ దారుణం జరగడం బాధాకరం. లేకపోతే 'జోరో' చిత్రంలో శ్రీదేవిని చివరిసారి చూసిన గుర్తులు జ్ఞాపకాలుగా నిలిచి ఉండేవి. ఇక ఈమె ఆ మద్య కోర్టు వివాదాలతో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈమె సవతి సోదరులు, ఈమె సోదరి శ్రీలతలు లిస ఈమె ఆస్థిలో తమకు వాటా కూడా ఉందని కోర్టుకి ఎక్కారు. ఇక శ్రీలత, మహేశ్వరి వంటి హీరోయిన్లు శ్రీదేవి పేరును చెప్పుకుని చాన్స్‌లు సంపాదించిన వారేనని చెప్పాలి. 

Sridevi Dancing With Boney Kapoor, One Last Time:

Sridevi Was Last Seen Just Days Ago In Video From Family Wedding    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs