శ్రీదేవి గత శనివారం దుబాయ్ లో రాత్రి 11 . 30 నిమిషాల సమయంలో ఒక హోటల్ లో గుండెపోటుతో సడన్ గా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె తమ మేనల్లుడు పెళ్ళికి దుబాయ్ వెళ్లి అక్కడ పెళ్లి వేడుకల్లో పాల్గొని.. తర్వాత హోటల్ రూమ్ లో ఉండగా.... ఆమెకి గుండెపోటు రావడంతో చనిపోయిందని మాత్రమే అందరికి తెలుసు. కానీ శ్రీదేవి మరణంపై ఈ రోజు సోమవారం ఉదయం నుండి అనేక రకాల అనుమానాలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. శ్రీదేవి గుండెపోటుతోనే మరణించిందా...? లేకపోతె మరేదన్నా కారణం ఉందా అనేది ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవరకు చెప్పలేకపోయారు. అయితే దుబాయ్ డాక్టర్స్ కూడా శ్రీదేవిది సహజ మరణం కాదంటున్నారు. డాక్టర్స్ శ్రీదేవి గుండెపోటుతో మరణించిందని ఎక్కడా ద్రువీకరించేలేదు.
పోస్ట్ మార్టంలో కొత్త ట్విస్ట్.
అయితే శ్రీదేవి పోస్ట్ మార్టంలో మాత్రం శ్రీదేవి బాత్ టబ్ లోని నీళ్ళల్లో పడిపోవడం వలెనే మరణించిందని చెబుతున్నారు. మొదటి నుండి శ్రీదేవి బాత్ రూమ్ లో ఉన్నప్పుడే హార్టెటాక్ వచ్చిందని అన్నారు. అయితే శ్రీదేవి బాత్ రూమ్ లో బాత్ టబ్ లో పడిపోయి ఆ నీళ్ల వలనే మృతి చెందినదనేది ఇప్పుడు పోస్ట్ మార్టం లో బయటికి వచ్చిన ట్విస్ట్. అలాగే శ్రీదేవి దిగిన హోటల్ లోని సూట్ ని దుబాయ్ పోలీసులు సీజ్ చేశారు. శ్రీదేవి బాత్ టబ్ లో అచేతనంగా పడి ఉండడంతో ఆమెని హాస్పిటల్ కి తరలించినట్లుగా చెబుతున్నారు. అయితే శ్రీదేవికి వాష్ రూమ్ లోకి వెళ్లడంతోనే గుండెపోటు వచ్చి బాత్ టబ్ లో పడిపోయిందా.. లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే శ్రీదేవి పోస్ట్ మార్టంలో మాత్రం శ్రీదేవి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం వలెనే చనిపోయిందని నివేదిక వచ్చింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీదేవి బాడీలో ఆల్కహాల్ అధికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆమె భర్త బోనీకపూర్ ని, కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా శ్రీదేవి ఫోన్ కాల్ డేటాని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే స్పృహలేక బాత్ టబ్ లో పడి చనిపోయారా, లేదా ఎవరైనా తోసేశారా అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. దాంతో ఆమె భౌతిక కాయాన్ని అప్పగించేందుకు జాప్యం జరిగేలా ఉంది.
ఇక శ్రీదేవి పోస్ట్ మార్టం, ఆమె డెత్ సర్టిఫికెట్ ని కుటుంబ సబ్యులకు అందజేసిన ఫోరెన్సిక్ నిపుణులు.. శ్రీదేవిని ముంబై పంపేందుకు ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక శ్రీదేవి ముంబై చేరుకొనేసరికి రాత్రి 10 గంటల సమయం అవుతుందని.. కావున శ్రీదేవి అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ముంబై శ్రీదేవి రాకకోసం జనసంద్రంగా మారింది. ఒకవైపు సెలబ్రిటీస్, మరోవైపు అభిమానులు ఇలా ముంబై మొత్తం శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచి చూస్తున్నారు.