సాదారణంగా కొందరికి పెళ్లి మీద ధ్యాస ఉండదు. ఇక నేటి జనరేషన్‌లో ఎక్కువగా యువత కేవలం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లి అదే బందీఖానాలో బలైపోవడానికి వారు సిద్దంగా లేరు. ఇక ఇలాంటి విషయాలలో మన సినిమా స్టార్స్ మరింత ముందుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో కేవలం సహజీవనం, ఎఫైర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక పెళ్లి చేసుకున్నా వాటి ఎక్స్‌పైరీడేట్ చాలా తక్కువ. ఇలా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునే వారు కూడా ఎందరో. ఇక పిల్లలు కావాలి అనిపిస్తే సరోగసీ ద్వారా, లేదా దత్తత ద్వారా తీసుకుంటున్నారు. వీరందరినీ సాధారణంగా పెళ్లెప్పుడు అంటే.. పలు కారణాలు చెబుతూ ఉంటారు.
కానీ ఇండియన్ సినీ చరిత్రలోనే మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్‌లర్‌గా 50 ఏళ్లు దాటిన సల్మాన్‌ఖాన్‌ని చెప్పుకోవాలి. ఈయన వయసు 50 దాటినా కూడా పెళ్లి విషయం వస్తే ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుంటాడు. ఇక ఈయనకు బాలీవుడ్‌లో ఎవరికిలేనన్ని ఎఫైర్స్ ఉన్నాయి. మరి సుఖం కావాలంటే కేవలం పెళ్లే చేసుకోవాలా? సెక్స్ కోరికలు తీర్చుకోవాలంటే పెళ్లి మాత్రమే మార్గం కాదనేది ఆయన అభిప్రాయం. తాజాగా ఆయన ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా మీడియా మరోసారి సల్మాన్‌ఎదుట పెళ్లి ప్రస్తావన తెచ్చింది.
దానికి ఆయన సమాధానం ఇస్తూ, పెళ్లి అనేది నేడు భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం, నా తండ్రి పెళ్లి ఖర్చులకి 180 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు పెళ్లి అనేది కోట్లతో కూడిన వ్యవహారం. అమ్మాయిని వెతకడం నుంచే ఖర్చు మొదలవుతుంది. పెళ్లి తర్వాత భార్య కోసం కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సివుంటుంది. అంత ఖర్చు నావల్లకాదు. నేనుభరించలేను... అంటూ కొత్త వాదనను, కొత్త విషయాన్ని చెప్పి తన హాస్యచతురతను చూపించాడు.