Advertisement
Google Ads BL

శ్రీదేవి భౌతికదేహాన్ని ఇవ్వంది అందుకే!


అతిలోక సుందరి శ్రీదేవి సావిత్రి తర్వాత అంతగా దక్షిణాదికే గాక ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఆరాధ్యదేవత. ఇండియాలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌ హోదా పొందిన నటి. ఇక ఈమె దక్షిణాదిలోని తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ, బాలీవుడ్‌ చిత్రాలలో నటించి ఎంతో కాలం ఏకచ్చత్రాధిపత్యంగా ఇండస్ట్రీని ఏలింది. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మలయాళంలో 26, కన్నడలో ఆరు చిత్రాలలో నటించింది. నాడు ఆమె దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్‌ హీరోయిన్‌. ఇన్ని చిత్రాలలో నటించినా కూడా ఆమె కూడా చివరిరోజుల్లో ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడిందని సమాచారం. ఈమె భర్త బోనీకపూర్‌కి సినిమాల నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలలో నష్టం రావడంతో ఆ ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆమె శరీరంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. 

Advertisement
CJ Advs

ఈ విషయాన్ని ఆమె రీఎంట్రీలో చేసిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌, పులి, మామ్‌' చిత్రాలలో చూడవచ్చు. మొహం మొత్తం ముడతలతో, విపరీతమైన మేకప్‌తో కనిపించేది. ఆమె తర్వాత తరం నటులైన మాదురీదీక్షిత్‌, కాజోల్‌, ఐశ్వర్యారాయ్‌ వంటి వారు ఇప్పటికీ గ్లామర్‌తో అదరగొడుతున్నారు. వారిపిల్లల పక్కన వారు నిల్చుంటే తల్లి అనుకోరు.. కేవలం సోదరి అనుకుంటారు. కానీ శ్రీదేవి విషయంలోమాత్రం అలా జరగలేదు. ఆమె వయసు తాలూకూ, ఆమె టెన్షన్‌ తాలూకు ఎఫెక్ట్స్‌ ఆమె మొహంలో కనిపించేవి. అయినా కూడా శ్రీదేవి తన కూతుర్లతో ఏ వేడుకకు వెళ్లినా కూడా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేది. ఇక ఈమె తన 54 వ ఏటనే తనువు చాలించారు. దుబాయ్‌లో తన మేనల్లుడు, బాలీవుడ్‌ నిర్మాత మోహిత్‌ మార్వా వివాహ వేడుక కోసం  భర్త బోనీకపూర్‌, చిన్న కుమార్తె ఖుషీతో కలిసి దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి హార్ట్ ఎటాక్ తో మరణించిన విషయం తెలిసిందే.

శ్రీదేవి భౌతికదేహానికి జరిగే పరీక్షల్లో జాప్యం జరగడంతో ఫోరెన్సిక్ టెస్ట్ లు పూర్తి అయిన తర్వాతే ఆమె భౌతిక కాయం ముంబైకి రానుంది. దుబాయ్ రూల్స్ ప్రకారం హాస్పిటల్ లో కాకుండా విడిగా చనిపోయిన వారి గురించి 24 గంటల వరకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకూడదంట. అందువల్లే శ్రీదేవి భౌతికదేహం ఇంకా ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఆమె దేహాన్ని కనీసం స్పెషల్‌ ఫ్లయిట్ కూడా తేలేని స్థితిలో ఆమె కుటుంబ ఆర్ధిక స్థితి ఉంది. దీనిని తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన చార్టెడ్‌ ఫ్లైట్‌ని దుబాయ్‌ పంపించాడు. 13 సీట్ల సౌకర్యం ఉండే ఈవిమానం నిన్న మధ్యాహ్నమే ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లింది.ఈ చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఆమె పార్దివ శరీరంతో పాటు ఆమె బంధువులు, సన్నిహితులు కూడా ముంబై రానున్నారు. 

Reason Behind Delay of Sridevi body Reached to India:

Sridevi's body to be brought back in Anil Ambani's aircraft
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs