Advertisement
Google Ads BL

పూర్తిగా ప్రియా వారియర్‌ లా మారిన బన్నీ..!


'ఒరు ఆధార్‌ లవ్‌' చిత్రం నుంచి విడుదలైన 26 సెకన్ల వీడియోతో యువతకు ఆరాద్యదేవతగా మారింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. కేవలం తన చూపులు, హావభావాలతో ఆమె ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది. ఆమె కొంటె చూపులతోపాటు చేతి వేళ్లని గన్‌లా పెట్టి చేతికి ముద్దు పెట్టి వాటిని యువతపై వదులుతున్న షాట్స్‌ అద్భుతంగా క్రేజ్‌ని సాధించాయి. దాంతో మొదటి చిత్రం విడుదల కాకముందే ఆమె ఇంటి ముందు పలు భాషల దర్శకనిర్మాతలు క్యూకట్టారు.

Advertisement
CJ Advs

ఇక 'ఒర్‌ ఆధార్‌ లవ్‌'ని తమ భాషల్లో డబ్‌ చేయడం కోసం కూడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. దీనిని బట్టి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుతున్న ఈమె డిగ్రీ పూర్తి చేయడం కష్టమేనంటున్నారు. ఇక ఈమెని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 45 లక్షలు దాటి 50లక్షలకు చేరువ అవుతోంది. ఈ స్థాయి ఫాలోయర్‌ తమన్నా, తాప్సితో పాటు పలు బాలీవుడ్‌ స్టార్స్‌కి కూడా లేదు. బాలీవుడ్‌ లెజెండ్‌ రిషికపూర్‌ నుంచి అల్లుఅర్జున్‌, సిద్దార్ద్‌ల వరకు అందరనీ ఆకట్టుకున్న ఈమె తాజాగా కొచ్చిలో ఐపిఎల్‌ కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంకి వచ్చిన సచిన్‌టెండూల్కర్‌, అభిషేకబచ్చన్‌లతో కూడా ఆమె ఫోటోలు దిగి తన క్రేజ్‌ని చాటుకుంది. 

ఇక ఈమెని ఇప్పటికే పొగడ్తల వర్షం కురిపించిన బన్నీ తాజాగా ఆమె తరహా హావభావాలు,చూపుడు వేలు, మద్య వేలుకి ముద్దుపెట్టి తనకుమారుడు అయాన్‌కి దానిని గురి పెట్టి షూట్‌ చేశడు. అయాన్‌ కూడా మరింత ఉత్సాహంగా ఆ తుపాకీ గుండు తనకి తగిలినట్లుగా యాక్ట్‌ చేస్తూ బెడ్‌పై పడిపోయాడు. ఈ వీడియోను బన్నీ శ్రీమతి స్నేహారెడ్డి సోషల్‌మీడియాలో పెట్టింది. ఈపోస్ట్‌ అందరినీ అలరిస్తోంది. ముందుగా ప్రియావారియర్‌ని మెచ్చుకున్న బన్నీ ఇప్పుడు ఆమెలాగే చేయడంతో ఇది ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

Bunny Turns Priya Warrier For His Son:

Allu Arjun and Allu Ayaan reprise Priya Varrier's Video
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs