Advertisement
Google Ads BL

నాని రేంజ్ ఇలా ఉంది..!


ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన హీరో ఎవరు అంటే మాత్రం వెంటనే ఏ స్టార్ హీరో పేరు చెబుతారో తెలుసా.. అందరూ నేచురల్ స్టార్ నాని పేరే చెబుతున్నారు. ఎందుకంటే... నాని కున్న ట్రాక్ రికార్డు అలాంటిది. వరుస విజయాలతో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాకి కూడా అదిరిపోయే కలెక్షన్స్ ఇచ్చే శక్తి ఇప్పుడు నానికి వచ్చేసింది. దానికి పక్కా ఉదాహరణ గత ఏడాది చివర్లో వచ్చిన ఎంసీఏ. ఈ సినిమా విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ తెచ్చుకుని సినిమా ఢమాల్ అంది అన్నారు. కానీ నాని కున్న క్రేజ్ తో ఆ సినిమాకి దిల్ రాజు లాభాల మూటలు కట్టుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడు స్టార్ హీరోల సంగతి అలా ఉంచితే.. ఎక్కువమంది దర్శక నిర్మాతలు నాని వైపే చూస్తున్నారు. కేవలం చిన్న నిర్మాతలే కాదండోయ్... భారీ నిర్మాణ సంస్థల సైతం నాని కోసం పడిగాపులు పడుతున్నాయంటే అతిశయోక్తి లేదంటున్నారు. ఒకప్పుడు నాని రికార్డు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు  వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేస్కుంటున్న నాని తో సినిమా చెయ్యాలని ప్రతి దర్శక నిర్మాత ఎదురు చూస్తున్నాడు అంటేనే నాని క్రేజ్ ఒక లెవల్లో ఉందని అర్ధమవుతుంది. కేవలం 20 కోట్లతో సినిమా చేస్తే.. నానికున్న క్రేజ్ కారణంగా ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకి బిజినెస్ జరగడమే కాదు... శాటిలైట్స్ రైట్స్, డిజిటల్ రైట్స్ అంటూ ఇలా మిగతా రైట్స్ కి కూడా మరో పది కోట్లు నిర్మాతల చేతుల్లోకి వస్తున్నాయి.

మరి నాని మీద 20 కోట్లు పెడితే 20  కోట్లు లాభం వస్తుంది. అలాంటి బంగారు బాతుని ఎవరైనా వదులుతారా... అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలంతా నాని నే తమ హీరో అంటున్నారు. మరి నాని కూడా చాలా కాలిక్యులేటెడ్ గా సినిమాలను ఒప్పుకున్నప్పటికీ వాటిని చక చకా పూర్తి చేసేసి దర్శకనిర్మాతలకు టెన్షన్ లేకుండా చేసేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన కృష్ణార్జున యుద్ధం విడుదలకు సిద్ధమవుతుంటే... నాని.. నాగార్జున తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించబోతున్నాడు. మరి నాని రేంజ్ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి తీసిపోనట్టుగానే కనబడుతుంది. ఇక ప్రస్తుతం నాని కోసం అనేకమంది దర్శక నిర్మాతలు కాచుకుని కూర్చుకున్నారు. చూద్దాం నాని ఎలాంటి సబ్జెట్, ఎలాంటి దర్శక నిర్మాతలను ఎన్నుకుంటాడో.

Hero Nani Range increased:

Tollywood Top directors and Producers Waiting for Nani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs