Advertisement
Google Ads BL

మోహన్‌బాబు చెప్పేది నమ్మమంటారా..?


ఇటీవల ఫుల్‌లెంగ్త్‌ హీరోగా మోహన్‌బాబు మరలా 'గాయత్రి' చిత్రం ద్వారా వచ్చాడు. సినిమాలో ఈ వయసులో కూడా మోహన్‌బాబు చూపిన ఎనర్జీని మెచ్చుకున్నారు కానీ సినిమా మాత్రం బాగాలేదని తేల్చేశారు. దాంతో ఈ చిత్రం ఓ మోస్తరు టాక్‌ తెచ్చుకున్నా కూడా కమర్షియల్‌గా ఫ్లాప్‌ అనిపించుకుంది. ఈ రిజల్ట్‌ మోహన్‌బాబుని చాలా బాధించిందని సమాచారం. ఇక ఇందులో ఆయన పెద్దకుమారుడు మంచు విష్ణు కూడా నటించాడు.

Advertisement
CJ Advs

మంచు విష్ణు ఈ చిత్రం విడుదల కాకముందు మాట్లాడుతూ, తాను నటించిన ఈ పాత్రను ప్రజలు ఆదరించకపోతే ఇక తాను నటునిగా పనికిరానని నిర్ణయించుకుంటానని చెప్పాడు. మరోవైపు తాజాగా మోహన్‌బాబుని హీరోల తమ వారసులను, హీరోయిన్లు తమ కూతుర్లను వారసురాలుగా ప్రమోట్‌ చేస్తారు? ఎందువల్ల? అని ప్రశ్నిస్తే ఆయన అలాంటిదేం లేదు. నా కూతురు లక్ష్మి కూడా సినిమాలలో నటిగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే రాణించి ప్రశంసలు, అవార్డులు కూడా సాధించింది కదా? ఇక నేను మంచు విష్ణుని హీరోని చేయాలని భావించలేదు. వాడు మంచిపొడవుతో బాస్కెట్‌ బాల్‌ నేషనల్‌ ప్లేయర్‌ కూడా. ఇంజనీరింగ్‌లో ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌. దాంతో వాడిని ఐపీఎస్‌ని చేద్దామని భావించాను. మంచు మనోజ్‌ని హీరోని చేయాలని అనుకున్నాను. కానీ మంచు విష్ణు తనకి నటనలో ఆసక్తి ఉందని వాళ్ల అమ్మకు చెప్పడంతో ఓకే అన్నాను.. అని చెప్పుకొచ్చాడు. 

ఎవరు ఏమి చెప్పిన మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మి, విష్ణు,మనోజ్‌ ముగ్గురు ఇప్పటికీ, నటులుగా కెరీర్‌ ప్రారంభించిన ఇంత కాలానికి కూడా తమ తండ్రి పేరు మీదనే బండిలాక్కోస్తున్నారు గానీ తమ సత్తాను ఇంకా చాటలేదనే చెప్పాలి. ఇక 'గాయత్రి'లో మోహన్‌బాబు 'సార్వభౌమాధికారం' అని పలకలేక భౌ..భౌ అనే వారు కూడా రాజకీయనాయకులు అయిపోతున్నారని సెటైర్‌ పేల్చాడు. సార్వభౌమాధికారం అంటే అర్ధం, వాటిని పలకడం మోహన్‌బాబు కుటుంబంలోని ఈ ముగ్గురు వారసులకు కూడా రాదనే సెటైర్లు బాగానే వినిస్తున్నాయి. 

Mohan Babu About His Sons and Daughter:

Mohan Babu Proud of Vishnu!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs