తమన్‌పై కాపీ క్యాట్ అనే చెడ్డపేరు ఉంది గానీ మణిశర్మ తర్వాత బీజీఎం ఇవ్వడంలో ఇప్పుడున్న వారిలో ఈయనేదిట్ట. ఇక తన కెరీర్ స్టార్టింగ్‌లోనే ఆయనకు మన స్టార్స్, స్టార్ దర్శకుల చిత్రాలకు సంగీతం అందించే అవకాశాలు వచ్చాయి. అలా తక్కువ సమయంలోనే 50 చిత్రాల మార్క్‌ని కూడా దాటిన తమన్ ఆ మధ్య పోటీలో వెనుకబడ్డాడు. అదే సమయంలో మహేష్-మురుగదాస్‌ల 'స్పైడర్'తో హారీస్ జైరాజ్, 'అజ్ఞాతవాసి'తో అనిరుధ్‌లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అధినేత రాధాకృష్ణలు 'అజ్ఞాతవాసి' సమయంలోనే అనిరుధ్‌తో రెండు చిత్రాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ముందు చిత్రం 'అ..ఆ'కి కూడా అనిరుద్‌ని ఎంచుకున్నారు కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల మిక్కిజే మేయర్‌తో లాగించారు.
ఇక 'అజ్ఞాతవాసి' చిత్రం విషయంలో ట్యూన్స్, బీజీఎం పరంగా కూడా అనిరుధ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆయన ఈ చిత్రం విడుదల కాకముందే తాను ఎన్టీఆర్ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నానని తెలిపాడు. కానీ ఈ చిత్రం నుంచి అనిరుధ్ అవుట్ అయ్యాడని, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరో సంగీత దర్శకుడిని పెట్టుకుంటారని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో దేవిశ్రీప్రసాద్ పేరు కూడా వినిపించింది. కానీ తమన్ పేరు మాత్రం బాగా హైలైట్ అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం విషయంలో తమన్ నోరు విప్పాడు. ఈ ఏడాది ఇప్పటికే 'భాగమతి', 'తొలిప్రేమ'లతో తమన్ తన సత్తా చాటాడు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మొదటి చిత్రానికి నేనే సంగీతం అందిస్తున్నాను. అద్భుతమైన స్క్రిప్ట్ అని తెలిపాడు. దీనితో పాటు ప్రస్తుతం తమన్ వద్ద దేవిశ్రీకి ఉన్నన్ని ఆఫర్స్ ఉన్నాయి.
ఇక తమన్ త్రివిక్రమ్ నిర్మాతగా, రచయితగా నితిన్ హీరోగా వస్తున్న 'ఛల్ మోహన్ రంగా'కి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఆ వర్క్ పట్ల హ్యాపీగా ఫీలై త్రివిక్రమ్ ఈ చాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక గతంలో తమన్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా, బృందావనం, రభస' చిత్రాలకు సంగీతం అందించాడు. వీటిల్లో రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రంతో తమన్ ఎన్టీఆర్‌కి మూడో బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్‌ని ఇస్తాడో లేదో వెయిట్ చేయాల్సివుంది.