Advertisement
Google Ads BL

సమ్మర్ రిలీజ్ సినిమాల లిస్ట్ ఇదే..!


 

Advertisement
CJ Advs

ఈ సమ్మర్ సినిమా లవర్స్ కి చాలా కూల్ గా ఉండనుంది. మహేష్ బాబు సినిమా నుండి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా వరకు చాలా మంది హీరోస్ మనకి హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. అయితే ఎవరి సినిమా ముందు వస్తుందో..తర్వాత ఎవరి సినిమా వస్తుందో చూద్దామా..

* ముందుగా హీరో నిఖిల్ ఈ సమ్మర్ ఫీవర్ ను స్టార్ట్ చేయనున్నాడు. కన్నడంలో సూపర్ హిట్ అయిన.. 'కిరాక్ పార్టీ' తో మార్చి 16న రాబోతున్నాడు.

* మార్చి 23న కళ్యాణ్ రామ్ 'ఎం.ఎల్.ఏ' గా వస్తున్నాడు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ.

* ఇక మార్చి 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' ద్వారా మనల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలని క్రియేట్ చేసింది.

* పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య డైరెక్టర్ గా నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగా' ఏప్రిల్ 5న రాబోతోంది.

* గత ఏడాది హ్యాట్రిక్ కొట్టిన నాని ఈ ఏడాదిలో 'కృష్ణార్జున యుద్ధం' ద్వారా ఏప్రిల్ 13న మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు.

* సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా వస్తున్న భారీ చిత్రం 'భరత్ అనే నేను' ఏప్రిల్ 20 న రానుంది. శ్రీమంతుడు తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

* ధనుష్ నిర్మాణంలో రజినికాంత్ 'కాలా' సినిమాను ఏప్రిల్ 27న మన ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

* అల్లు అర్జున్ 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' మే 4న విడుదల అవుతున్నట్టు అధికారంగా ప్రకటించారు. ఈ సినిమాలో బన్నీ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

* జయ జానకి నాయక తో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' మే 11న చెప్పబోతున్నాడు. 

ఇవేనండి మార్చి నుండి మే లో రిలీజ్ అయ్యి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న చిత్రాలు. మరి ఇందులో ఏవి హిట్ అవుతాయో.. ఏవి ఫట్ అవుతయో చూడాలి.

2018 Summer Release Movies:

2018 Summer Special Movies Release Date Schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs