Advertisement
Google Ads BL

'బాహుబలి'కి బ్రిటీష్ భామ సాయం...!


ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరు ఎదురు చూస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం కోసం దేశం మొత్తం మాత్రమే కాదు.. చైనా,జపాన్‌, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలలోని సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 'బాహుబలి' రికార్డులను దాటకలిగిన ఏకైక చిత్రంగా అందరు భావిస్తున్నారు. మరోవైపు 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం కూడా అందరు వెయిటింగ్‌లో ఉన్నారు. 'బాహుబలి' ద్వారా తన సత్తా చూపిన ప్రభాస్‌ 'సాహో'తో దానిని నిలబెట్టుకుంటాడా? లేదా? అనే సందేహాలు వస్తున్న తరుణంలో బడ్జెట్‌ని 210కోట్లకు పెంచి బాలీవుడ్‌లో ఈ చిత్రం బాధ్యతలను కరణ్‌జోహార్‌కి ఇవ్వనుండటంతో దీనిపై కూడా మంచి అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న 'సాహో'లో శ్రద్దాకపూర్‌, మందిరాబేడీ, వివేక్‌ ఒబేరాయ్‌, జాకీష్రాఫ్‌ వంటి పలువురు బాలీవుడ్‌ నటులు కూడా నటిస్తున్నారు. ఇక సంగీతాన్ని బాలీవుడ్‌ సంగీత త్రయం 'శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌'లు అందిస్తున్నారు. ఇక 'సాహో' చిత్రం ముందే '2.0' చిత్రం విడుదల కానుంది. అదే జరిగితే ఇందులో నటించిన రజనీ, అక్షయ్‌కుమార్‌, దర్శకుడు శంకర్‌లతో పాటు హీరోయిన్‌ ఎమీ జాక్సన్‌కి కూడా భారీ డిమాండ్‌ ఏర్పడటం ఖాయం. ఇక 'ఎవడు, ఐ' వంటి చిత్రాల ద్వారా మెప్పించిన ఈ బ్రిటీష్‌ సుందరిని 'సాహో' చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్‌రెడీ ఇందులో శ్రద్దాకపూర్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేయనుందని తెలుస్తోంది. ఈమెకి మందిరా బేడీకి తోడుగా ఎమీ కూడా ఇందులోకి ఎంట్రీ ఇస్తే ఈ చిత్రం క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయమనే చెప్పాలి. 

ఈ విషయమై దర్శకుడు సుజీత్‌ కూడా ఎమీజాక్సన్‌ని కలసి మాట్లాడాడని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌ పట్ల సుముఖంగా ఉందనే తెలుస్తోంది. మరి ఈ '2.0' సుందరి ఇందులో ఏదైనా కీలకపాత్రను చేస్తుందా? లేక ఐటం సాంగ్‌ చేయనుందా? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి ఈమె నటిస్తే మాత్రం 'సాహో'కు మరో ప్లస్‌ పాయింట్‌గా మారడం మాత్రం ఖాయమనే చెప్పాలి. 

Amy Jackson in Saaho Movie:

Amy Jackson to make a cameo appearance in Prabhas Saaho
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs