రజినీకాంత్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినా సినిమాలు చేయడం మానలేదు అని స్పష్టమైంది. ప్రస్తుతం 'కాలా', '2.0' రెండు సినిమాలు ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా 'కాలా' సినిమా ఏప్రిల్ 27న రాబోతోంది. ఇక '2.0' పోస్టుపోన్ అవుతూ.. ఆగస్టుకు వెళ్ళింది. ఒకే ఏడాదిలో రజినీవి రెండు సినిమాలు వచ్చి చాలా కాలం అయింది.
ఈ రెండు సినిమాలు తర్వాత రజిని పాలిటిక్స్ లో బిజీ అవుతారని అందరు అనుకున్నారు. సినిమాలు చేయడం మానేస్తారు అనుకున్నారు. ఆలా అనుకున్న వారందరికీ రజిని స్వీట్ షాక్ ఇచ్చారు. త్వరలోనే రజిని ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారంగా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాకు వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరున్న కార్తిక్ సుబ్బరాజ్ మొదటిసారి రజని సినిమా చేయబోతున్నాడు. గతంలో పిజ్జా.. ఇరైవి వంటి సినిమాలు తీశాడు కార్తీక్. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలిసింది.
ఈ స్వీట్ న్యూస్ విన్న రజిని ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇలా వరసగా సినిమాలు మీద సినిమాలు చేయటంలో రజిని ఉద్దేశ్యం ఏంటో కానీ తన ఫ్యాన్స్ మాత్రం తెగ ఆనంద పడిపోతున్నారు. రాజకీయాల్లో రజినీకి ప్రత్యర్థిగా కమల్ హాసన్ వచ్చి జనాలలోకి తనదైన స్థాయిలో దూసుకుపోతున్నాడు. మరి ఇది దృష్టిలో పెట్టుకునే కొత్త సినిమాకు ఓకే చెప్పాడా లేదా ముందే కమిట్మెంట్ ఇచ్చినందువలన సినిమా చేస్తున్నాడా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.