Advertisement
Google Ads BL

చిరు కండీషన్స్.. యంగ్ మెగా హీరోలకే!


మెగా ఫ్యామిలీ నుండి డజన్ మంది దాక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందరు హీరోలే అవ్వడంతో అందరికి చిరంజీవి సపోర్ట్ కావాలి. అందరి ఫంక్షన్స్ కి చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. అయితే ఒకరి ఫంక్షన్ కి వెళ్లి మరొకరి దానికి వెళ్లకపోతే హర్ట్ అయ్యే అవకాశం ఉందని చిరంజీవి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Advertisement
CJ Advs

చిరంజీవి ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి రానని చెప్పేశారట. సినిమా విడుదలకి ముందు నేను ఎటువంటి సపోర్ట్ చేయనని విడుదల తర్వాత మాత్రం ఆయా సినిమాలకి మాట సాయం చేస్తానని ఇటీవలే కుటుంబం అంతా కలిసినపుడు చెప్పారట. ఒకవేళ సినిమా హిట్ అయితే ప్రెస్ మీట్ పెడతానని తొలిప్రేమ.. ఇంటిలిజెంట్‌ రిలీజ్‌ ముందే చెప్పారట.

దీంతో తొలిప్రేమ చిత్రానికి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ్ముడి కొడుక్కి ఎంకరేజ్‌మెంట్‌ ఇచ్చారు. కానీ సాయి ధరమ్ తేజ్.. చిరంజీవి సపోర్ట్ కావాలంటే ఒక హిట్టు కొట్టి తీరాలన్నమాట. బాగుంది కదూ చిరంజీవి కండిషన్‌! కాకపోతే ఈ కండిషన్ ఆల్రెడీ స్టార్ హీరోస్ గా వున్న చరణ్.. బన్నీ సినిమాలకి మాత్రం వర్తించవట.

Chiranjeevi Conditions to Young Mega Heroes:

Chiranjeevi Sensational Decision on Young Mega Heroes Movie Events
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs