Advertisement
Google Ads BL

అల్లుశిరీష్‌ తన తెలివి చూపిస్తున్నాడు!


తెలుగులో మాస్టర్‌మైండ్‌ అంటే అల్లుఅరవింద్‌నే చెప్పుకోవాలి. ఆయన తన లౌక్యంతో ఎవ్వరికీ వీలుకాని డీల్స్‌ని కూడా సెట్‌ చేస్తుంటాడు. ఆయన కుమారులైన అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌లకి కూడా తండ్రి తెలివితేటలే వచ్చాయి. ఇక బన్నీ, పవన్‌ విషయంలో అరవింద్‌ మౌనం, పవన్‌ ఆమధ్య ప్రజారాజ్యం ప్రచారంలో అరవింద్‌ చేసిన జిమ్మిక్కుల గురించి వ్యాఖ్యలు, జనసేనని కొండగట్టు నుంచి ప్రారంభించిన సమయంలో కూడా అల్లు వారు మౌనంగా ఉండటం అందరికీ తెలిసిందే. ఇక అల్లుఅర్జున్‌ తన చాణక్యంతో ఇతరులు తీసుకున్న రీమేక్‌ రైట్స్‌ని కూడా తాను కావాలనుకుంటే తీసుకోగలడు. ఇదే రాజశేఖర్‌ విషయంలో కూడా జరిగింది. అలాగే తన కుమారులను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే బన్నీకి మలయాళంలో క్రేజ్‌ ఉంది. బన్నీ చిత్రాలు మలయాళంలో విడుదలైన సందర్భంగా బన్నీ బిజీగా ఉంటే కేరళలో అల్లుశిరీషే ప్రమోషన్స్‌లో పాల్గొంటాడు. దాంతో తన అన్నయ్య క్రేజ్‌ ద్వారా తాను కూడా కేరళలో గుర్తింపు పొందాలని భావిస్తున్నాడు. ఇక తన తండ్రి పుణ్యమా అని ఆయనకు మోహన్‌లాల్‌ నటించిన '1971- బియాండ్‌ది బోర్డర్స్‌' చిత్రంలో శిరీష్‌కి సోల్జర్‌ చిన్మయి అనే కామియో పాత్ర వచ్చింది. ఈ చిత్రం గతేడాది ఏప్రిల్‌లోనే మలయాళంలో విడుదలైంది అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయాలని భావించారు. కానీ ఆ చిత్రం మలయాళంలో ఘోరపరాజయం పాలవ్వడం, అల్లుశిరీష్‌కి కనీస రెస్పాన్స్‌ కూడా రాకపోవడంతో మెగా కాంపౌండ్‌ నిర్మాతలుగా చెప్పుకునే ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్నా కూడా తెలుగులో విడుదల చేయలేదు. ఇప్పుడు వారు ఆ చిత్రం రైట్స్‌ని మరో నిర్మాతకు అమ్మారు. 

ఇక 'యుద్దభూమి- 1971 భారత సరిహద్దు' పేరుతో ఈ చిత్రం పోస్టర్లను, టీజర్‌ని విడుదల చేశారు. మెగాభిమానులను ఆకర్షించేందుకు కామియో చేసిన అల్లుశిరీష్‌ చుట్టునే పోస్టర్స్‌, టీజర్స్‌ విడుదల చేసి మోహన్‌లాల్‌ని పట్టించుకోలేదు. ఇక అసలే మలయాళంలో డిజాస్టర్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం శిరీష్‌కి ఇష్టం లేదు. అందునా తానే హీరో అనే ప్రమోట్‌ చేస్తున్న తీరు తన కెరీర్‌కి పెద్ద ఇబ్బందిగా మారుతుందని భావించి, మోహన్‌లాల్‌ వంటి స్టార్‌ నటుడిని ప్రమోట్‌ చేయడం లేదంటూ రివర్స్‌ అయ్యాడట.

అంతేకాదు.. ఈ చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేయాలంటే తనకు 15లక్షలు అదనంగా ఇవ్వాలనే కండీషన్‌ కూడా నిర్మాతలు పాటించలేదని ఎన్వీప్రసాద్‌పై అల్లుశిరీష్‌ మండిపడుతున్నాడట. అదే ఈ చిత్రం హిట్‌ చిత్రం అయితే మాత్రం ఆయనే ముందుకొచ్చి ప్రమోషన్స్‌ చేసి ఉండేవాడు. ఇప్పుడు మాత్రం రివర్స్‌ అయ్యాడని సమాచారం. 

Allu Sirish Demands 15 Lakhs For Yuddhabhumi:

Allu Sirish Fires On Senior Producer!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs