Advertisement
Google Ads BL

ప్రభాస్ పై ఈ వార్త నిజమేనా..?


ప్రభాస్ ఇప్పుడు ఇంటెర్నేషనల్ స్టార్. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఆ రేంజ్ లో స్టార్ హీరో అయ్యాడు. అలాంటి ప్రభాస్ తో ఒక మాదిరి డైరెక్టర్ సినిమా చెయ్యాలంటే... అతను తెచ్చే కథ, కమామిషు ఎంత బలంగా ఉండాలి. అలాగే బాహుబలితో వచ్చిన క్రేజ్ ఏమాత్రం చెదరకుండా  ఒక మెట్టు పైకెక్కేలా సినిమా ఉండాలి... కానీ అందులో తేడా జరిగిందా బాహుబలితో వచ్చిన ఫెమ్ అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతోంది. అందుకే ప్రభాస్ బాహుబలి తర్వాత బాహుబలికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో సుజిత్ డైరెక్షన్ లో హాలీవుడ్ రేంజ్ లో 'సాహో' సినిమా చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

మరి ఈ సినిమా క్లిక్ అవగానే బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కూడా పాగా వేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభాస్ మధ్యలో జిల్ డైరెక్టర్ రాధాకృష్ణకి ఇచ్చిన మాట ప్రకారం ఒక మాదిరి బడ్జెట్ సినిమా చేయాల్సి ఉంది. మరి సాహో పూర్తికాగానే ప్రభాస్ జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఆ సినిమాని మమా అనిపించేసి బాలీవుడ్ కి చెక్కేస్తాడు అనుకుంటున్న సమయంలో... ప్రభాస్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని న్యూస్ బయటికి వచ్చింది. అందులో నిజమెంతుందో తెలియదు గాని.... డాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చెయ్యబోతున్నాడంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది.

రాజు సుందరం చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ కూడా ఆ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి రాజు సుందరం గొప్ప డైరెక్టరేమి కాదు. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ తమిళ్ ఫిలిం ఏగన్ భారీ డిజాస్టర్. తర్వాత తెలుగులో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ ఆ సినిమాకి రాజు సుందరం పనితనం నచ్చక ఆపేశారు. అలాంటి రాజు సుందరం డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తాడంటే... చాలా అనుమానమే. ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ అయిన లారెన్స్ డైరెక్షన్ రెబల్ అనే భారీ బడ్జెట్ సినిమా చేసి బాగా దెబ్బతిన్నాడు ప్రభాస్. మరి ఇన్ని చూసిన ప్రభాస్ అయితే రాజు సుందరం డైరెక్షన్ లో నటించే అవకాశమే లేదు.

Rumours on Prabhas next Movie:

Prabhas in Raju Sundaram direction    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs