Advertisement
Google Ads BL

ఫ్యాన్స్ కు మహేష్, చరణ్ స్పెషల్ గిఫ్ట్స్!


వచ్చే నెలలో ఉగాది పండగ వుంది. మన తెలుగువాళ్లు ఉగాదిని  చాలా బాగా జరుపుకుంటాం. కానీ మన హీరోస్ మాత్రం వారి సినిమాలని ప్రమోట్ చేయాలనీ చూస్తుంటారు. తమ ఫ్యాన్స్ ఆనందం కోసం ఆ రోజు సినిమాకు సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. అలానే ఈ ఉగాదికి కూడా ఇద్దరు స్టార్ హీరోస్ వారి సినిమాలను ప్రమోట్ చేసుకుందాం అనుకుంటున్నారు. వారు ఎవరో కాదు ఒకరు మహేష్ బాబు.. ఇంకొకరు రామ్ చరణ్.

Advertisement
CJ Advs

ముందుగా మార్చి 30న వస్తున్న రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఉగాది కానుకగా మార్చి 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రామ్ చరణ్ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నాడట. ఈ ఈవెంట్ కు చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వస్తారని తెలుస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ ఉగాదికి మహేష్ బాబు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. స్పెషల్ గా టీజర్ ని కట్ చేసి ఉగాది కానుకగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. అందుకోసం కొరటాల శివ ఈ టీజర్ పై స్పెషల్ ద్రుష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా ఫ్యాన్స్ ఆనందం కోసం చరణ్ అండ్ మహేష్ ప్లాన్స్ వేస్తున్నారన్నమాట.

Mahesh babu and Ram charan Special Gift to Fans:

Rangasthalam and Bharath ane nenu latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs