Advertisement
Google Ads BL

చెల్లెలి సంతోషాన్ని రెట్టింపు చేస్తున్న అక్క!


తెలుగులో 'లక్ష్మీకళ్యాణం'తో పుష్కరకాలం ముందు పరిచయమై 'చందమామ, మగధీర'తో స్టార్‌ హీరోయిన్‌గా మారింది కాజల్‌ అగర్వాల్‌. ఇన్నేళ్ల తన ప్రస్తానంలో ఆమె చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌ వరకు, రానా నుంచి నందమూరి కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌తో సహా నవదీప్‌, శివబాలాజీ వంటి వారి చిత్రాలలో నటించింది. ఇక సీనియర్‌ స్టార్స్‌కి హీరోయిన్లు కొరత ఏర్పడటంతో దానిని సద్వినియోగం చేసుకుని, చిరంజీవితో నటించిన 'ఖైదీనెంబర్‌ 150'కి ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకుంది. ఇక తమిళంలో కూడా అజిత్‌, విజయ్‌ వంటి వారిని లైన్‌లో పెట్టుకొస్తోంది. తన మొదటి చిత్రం దర్శకుడు తేజ కోసం రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి', తన మొదటి హీరో కళ్యాణ్‌రామ్‌లతో 'ఎమ్మెల్యే' చిత్రాలతో ఇప్పటికీ బిజీగా ఉంది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రాధిక, భానుప్రియ, ఆర్తి అగర్వాల్‌, నగ్మా, రాధ వంటి హీరోయిన్ల సోదరీమణులు కూడా నాటి నుంచి నేటి వరకు సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అదే తరహాలో నిషా అగర్వాల్‌ కూడా 'ఏమైంది ఈవేళ, సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో' వంటి చిత్రాలలో నటించినా నిలబడలేక పోయింది. దాంతో ఆమె 2013లో ప్రముఖ పారిశ్రామికవేత్త కరణ్‌ని వివాహం చేసుకుంది. నాడు ఈ పెళ్లిలో కాజలే పెళ్లి కూతురా అన్న తరహాలో ఆమె భలే హడావుడి చేసింది. కాగా నిషా అగర్వాల్‌ తాజాగా తల్లి అయింది. ఆమెకి ఓ బాబు పుట్టాడు. 

ఈ బాబుకి 'ఇషాన్‌ వాలేదా' అనే పేరును పెట్టినట్లు తెలిపిన కాజల్‌ అగర్వాల్‌ ఆ బాబుని ముద్డాడుతున్న ఓ ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ బాబు రాకతో కాజల్‌ అగర్వాల్‌ ఫ్యామిలీ మొత్తం పండుగ వాతావరణంలో సంతోషంగా ఉంది. మొత్తానికి కాజల్‌ అగర్వాల్‌ పెద్దమ్మ అయిపోయింది. మరి ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుని తాను ఓ తల్లిని అవుతుందో వేచిచూడాల్సి వుంది. తాజాగా కాజల్‌ కీలక పాత్రను పోషించిన 'అ!' చిత్రంలో ఆమె నటనకు, సినిమాకి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. 

​Kajal Proud Aunt Moment!:

Kajal With Nisha Agarwal Son Ishaan Valecha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs