Advertisement
Google Ads BL

పవన్‌ పైనే రేణుదేశాయ్ కవిత అంటున్నారు!


ఒకప్పుడు మోడల్‌గా, సినీ హీరోయిన్‌గా, ప్రస్తుతం టీవీ షోలకు జడ్జిగా, మరాఠి చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా పవన్‌కళ్యాణ్‌ రెండో భార్య రేణుదేశాయ్‌ తన పిల్లలతో తన తంటాలు ఏవో తాను పడుతోంది. ఓ మహిళగా ధైర్యంగా ముందడుగు వేస్తోంది. ఇక ఈమెని పవన్‌ వదిలేసి ఏడేళ్లయినా కూడా పవన్‌ అభిమానులు మాత్రం ఆమె ఏమి అన్నా.. మా హీరో గురించే అనుకుంటూ గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుము కుంటున్నారు. ఇక ఈమె మరోసారి పెళ్లి చేసుకోవాలని ఉందని, తనకి ఓ తోడు కావాలని వ్యాఖ్యానించినప్పుడు పవన్‌ అభిమానులు మండిపడ్డారు. వదినా అంటూనే మా దేవుడిని కాకుండా మరో వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఆ వ్యక్తిని నరికి చంపేస్తాం అంటూ ఊగిపోయారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా రేణుదేశాయ్‌ ఓ కవితను రాసి పోస్ట్‌ చేసింది. అది కూడా తమ హీరో గురించే అని పవన్‌ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈమె తన కవితలో తన జీవితంలో పాతుకు పోయిన కొన్ని జ్ఞాపకాలు మరలా గుర్తొచ్చాయంటూ ఆవేదన, ఆర్ధ్రతతో నిండిన కవితను చెప్పింది. నాలోని జ్ఞాపకాలన్నింటిని వెలికి తీశాను. ఆయన పదాలు, మాటలు, ఆయన పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాలలో నిక్షిప్తమయ్యాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మరలా ఆ జ్ఞాపకాలు నా కళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బలీయమైనది. మనసు లోతుల్లో పాతుకు పోయిన జ్ఞాపకాలన్నింటినీ మళ్లీ గుర్తు చేసింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పుపట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచి పెట్టుకుపోయాయి. ముక్కలైన హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కనిపించాయి అని ఆమె పోస్ట్‌ చేసిన వీడియో సాగింది. 

తాను జ్ఞాపకాల్లా నిక్షిప్తం చేయాలనుకున్నవి ఇప్పుడు లేవన్న భావనను ఆమె వ్యక్త పరిచింది. జ్ఞాపకాలు తిరిగి చూసుకుంటే తప్పు పట్టిన కలం, దానిపై రాసి వున్న పేరు తుడిచి పెట్టుకుపోయాయి. పాత జ్ఞాపకాలన్ని తన మనసు పొరల నుంచి తుడిచి పెట్టుకుని పోయాయని ఆమె ఎంతో హృద్యంగా తన మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చి, తన పరిస్థితిని ఎంతో కవితాత్మకంగా, హృద్యంగా మన ముందుంచిందనే చెప్పాలి.

Click Here for Video

Renu Desai Pierced Hearts:

Renu Desai poem goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs