Advertisement
Google Ads BL

నానికి వద్దు.. తేజూకి కావాలి..!


ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. ఆయన ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ద్విపాత్రాభినయంగా 'కృష్ణార్జున యుద్దం' చేస్తున్నాడు. దీని తర్వాత అశ్వనీదత్‌ నిర్మాతగా నాగార్జునతో కలిసి మల్టీస్టారర్‌కి ఓకే చెప్పాడు. ఇక ఈయన శ్రీనివాస్‌ అవసరాల, కిషోర్‌ తిరుమల వంటి పలువురు దర్శకులతో నటిచనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కిషోర్‌ తిరుమల తన మొదటి చిత్రం రామ్‌తో 'నేను శైలజ' చేసి సక్సెస్‌ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆయన రామ్‌తోనే చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' మంచి క్లాస్‌ టాక్‌ని తెచ్చుకున్నా, స్లో నెరేషన్‌ వల్ల విజయం సాధించలేదు. ఇక ఈయన ఆమధ్య సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌తో కూడా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రం చేయాల్సి ఉంది. 

Advertisement
CJ Advs

కానీ కిషోర్‌ తిరుమల ఇంకా ఎంతో రాటుదేలాలని భావించిన వెంకీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాడు. ఇక తాజాగా నాని కూడా కిషోర్‌ తిరుమలకు చివరి క్షణంలో నో చెప్పాడని సమాచారం. నాని కిషోర్‌ తిరుమలకి పలు మార్పులు చేర్పులు చెప్పినా, కిషోర్‌ ఆ మార్పులు చేసి కూడా నానిని మెప్పించలేకపోయాడు. దాంతో అదే స్టోరీని ఫ్లాప్‌లలో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం తేజు కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం. 

దాని తర్వాత మరోసారి 'విన్నర్‌' దర్శకుడు గోపీచంద్‌ మలినేనిలతో చిత్రాలు చేయాల్సి ఉంది. అవి పూర్తయిన తర్వాత కిషోర్‌ తిరుమల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఇక కిషోర్‌ తిరుమలతో హీరో నితిన్‌ కూడా ఓ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. మరి కిషోర్‌ నితిన్‌నైనా తన కథలో మెప్పించగలడా? లేదా? అన్నది చూడాల్సివుంది.

Sai Dharam Chitralahari:

Sai Dharam Tej and Kishore Tirumala Combo Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs