Advertisement
Google Ads BL

పాత్రని బొమ్మలో చూపించిన వరుణ్!


మెగా హీరోలైన రామ్ చరణ్ అన్ని రకాల సబ్జెక్టు లను టచ్ చేస్తూ స్టార్ హీరో అయ్యాడు. అలాగే మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా అంతే. స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్స్ తో వీరు దూసుకుపోతున్నారు. కానీ మిగతా మెగా హీరోల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సాయి ధరమ్ తేజ్ మూస ధోరణిలో మాస్ చిత్రాల వెంట పడుతూ ప్లాపులు కొని తెచ్చుకుంటున్నాడు. అలాగే మరో హీరో శిరీష్ కూడా యావరేజ్ సినిమాల్తో సరిపెట్టుకుంటున్నాడు. కానీ ఈ మధ్యనే హీరోగా నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ గతంలో కన్నా ఈ మధ్యన డిఫరెంట్ కథలను అంటే... లవ్ స్టోరీ లను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. మొదటి నుండి విభిన్న కథలతో వస్తున్న వరుణ్ తేజ్ తొలిప్రేమ వంటి లవ్ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా... అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే వరుణ్ తేజ్ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ఘాజి డైరెక్టర్ సంకల్ప రెడ్డి దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. ఆ సినిమాలో వరుణ్ తేజ్ కేరెక్టర్ ఏమిటో అనేది కూడా బయటికి వచ్చేసింది. అదేమిటంటే.. వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఒక ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) లా కనిపించబోతున్నాడట. అయితే ఈ ఆస్ట్రోనాట్ పాత్ర కోసం వరుణ్ తేజ్ జీరో గ్రావిటీలో ఎలా ఉండాలో శిక్షణ తీస్కోవటానికి  కజఖిస్తాన్ కూడా పయనమవుతున్నాడట. మరి దానికి సంబందించిన ఒక బొమ్మని వరుణ్ ఈ మధ్యనే కొనుక్కుని దాచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అయితే వరుణ్ కొనుకున్న ఆ వ్యోమగామి బొమ్మని వరుణ్ తేజ్ ఎంతో సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా కొత్త బొమ్మ అని చెప్పాడు. మరి వరుణ్ తేజ్ ఇలా ఆ వ్యోమగామి బొమ్మతో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అనేది అతను చెబుతున్న విధానంలోనే అర్ధమవుతుంది. ఇక ఘాజి లాంటి అద్భుతమైన సినిమా చేసిన డైరెక్టర్ తో వరుణ్ తేజ్ ఇలా ఒక వ్యోమగామి  స్క్రిప్ట్ తో సినిమా తీయడమనేది మెగా ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిస్తుంది.

Varun Tej Next Getup in Toy Form!:

Is It Varun Tej's Getup for His Next?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs