Advertisement
Google Ads BL

నిజమేనా.. చరణ్ కి రాశిఖన్నానా..?


కెరీర్‌ స్టార్ట్‌ అయి ఐదేళ్లయినా బబ్లీబ్యూటీగా పేరు తెచ్చుకున్న రాశిఖన్నా ఖాతాలో రెండు మూడు చెప్పుకోదగిన చిత్రాలే ఉన్నాయి. కానీ ఏకంగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేసిన 'జై లవకుశ'తో ఈమెకి గ్లామర్‌ పరంగా మంచి మార్కులు వస్తే, 'ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్'ల తర్వాత ఆమె 'తొలి ప్రేమ'తో తన సత్తా చాటింది. స్లిమ్‌గా మారడమే కాదు.. డెప్త్‌ ఉన్న సీన్లలో కూడా చేయగలిగిన సత్తా, మూడు వేరియేషన్స్‌ని చూపించే టాలెంట్‌ తనలో ఉన్నాయని నిరూపించుకుంది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో దిల్‌రాజు నిర్మాతగా, 'శతమానంభవతి' ఫేమ్‌ సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాస కళ్యాణం'లో కూడా హీరోయిన్‌గా ఈమెకే చాన్స్‌ వచ్చిందని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇక ఈ అమ్మడు మొదట రామ్‌చరణ్‌, సుకుమార్‌ల 'రంగస్థలం 1985'లో కూడా చాన్స్‌ దక్కించుకుందని, కానీ చివరి నిమిషంలో ఆ పాత్రను సమంత తన్నుకుపోయిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం ఆమెకి రామ్‌చరణ్‌ సరసన జోడీ కట్టే చాన్స్‌ వచ్చిందట. అందునా దేశవ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో కావడం విశేషం. రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌-చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చేయనున్నాడు. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఈ చిత్రం ఉంది. సినిమా ప్రారంభానికి ఎంతో సమయం ఉంది. అయినా చివరిక్షణంలో టెన్షన్‌ ఎందుకు అనుకుని రాజమౌళి ఎన్టీఆర్‌, చరణ్‌ల సరసన నటించే చిత్రంలో వారి జోడీలను వెతికే పనిలో ఉన్నాడు. 

ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా రాశిఖన్నాని ఫైనల్‌ చేశారని సమాచారం. రాజమౌళి చిత్రాలలో హీరోయిన్స్‌కి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వారి పాత్రలను కూడా స్పెషల్‌గా డిజైన్‌ చేస్తాడు. దాంతో ఇందులో రాశిఖన్నాకి చాన్స్‌ వస్తే రామ్‌చరణ్‌కి జోడీగా నటించే అవకాశంతో పాటు జక్కన్న చిత్రంలో నటించే అవకాశం కూడా చేజిక్కించుకున్నట్లే. అందునా ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' చేసి ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా నటించే చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన అంటే జాక్‌పాట్‌ కొట్టినట్లే. 

Rashi Kanna in Rajamouli Multi Starrer:

Ram Charan's heroine Rashi Khanna in SS Rajamouli multi-starrer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs