Advertisement
Google Ads BL

విరుష్క జంట పబ్లిక్ లో ఇలా..!


ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ కాకముందు నుంచే విరాట్‌ కోహ్లి, అనుష్కశర్మల ప్రేమాయణం మొదలైంది. మొదట్లో వీరి గురించి బాగానే వార్తలు వచ్చాయి. తర్వాత విరాట్‌కోహ్లి కెప్టెన్‌ పగ్గాలు కూడా చేపట్టి ఇండియా టీమ్‌ని నడిపిస్తున్నాడు. ఇక గతేడాది వాలంటైన్స్‌డే సందర్బంగా మొదటి సారిగా విరాట్‌ తమ ప్రేమ గురించి అఫీషియల్‌గా ప్రకటించాడు. నాటి నుంచి వారు ఎవ్వరిని పట్టించుకోనంతగా ప్రేమలో మునిగిపోయారు. ఎట్టకేలకు కిందటి ఏడాది డిసెంబర్‌లో వీరు పలు ఊహాగానల మధ్య ఇటలీలో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకుని అటు నుంచి అటే హానీమూన్‌కి కూడా వెళ్లిపోయారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఇండియా టీం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లగా టెస్ట్‌ మ్యాచ్‌లు అయిపోయే వరకు విరాట్‌ కోహ్లితో అనుష్క కూడా అక్కడే ఉంది. ఇక వన్డేలు, టి20ల కోసం విరాట్‌ సౌత్‌ ఆఫ్రికాలోనే ఉండిపోగా అనుష్కశర్మ ముంబై వచ్చి తన సినిమాలతో బిజీ అయింది. ఈమె చేసిన 'పారీ' అనే హర్రర్‌ మూవీ త్వరలో విడుదలకు సిద్దమవుతుండగా, ఆమె ప్రస్తుతం 'సూయీ దాగా' పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో వన్‌డేలో విరాట్‌ చేసిన సెంచరీని తన భార్య అనుష్కకే అంకితమిచ్చి తన ప్రేమను విరాట్‌ చాటుకున్నాడు. 

తాజాగా ఆయన ఓ ఫొటోని తన ఇన్‌స్ట్గాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. ఇద్దరు మొహాలు కనిపించకుండా గాఢముద్దులో ఉన్న ఫొటోని ఆయన పోస్ట్‌ చేస్తూ, 'వన్‌ అండ్‌ ఓన్లీ'అనే క్యాప్షన్‌ని పెట్టాడు. ఈ ఫొటో రెండు కొన్ని గంటల్లోనే 20లక్షల లైక్స్‌ని స్వంతం చేసుకోవడం విశేషం. వీరి ఫొటో వెనకాల కూడా ఓ జంట ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఫొటో ఉండటం విశేషం. కోహ్లి భార్యకి ప్రేమతో పోస్ట్‌ చేశాడని కొందరు., జంట చూడచక్కగా ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఆడే దేశాలలో అంతా ఈ జంటే బెస్ట్‌ పాపులారిటీ ఉన్న జంటగా చెప్పుకుంటున్నారు. 

Virushka Viral Kissing Poster:

My one and only love Virushka Viral Kissing Poster!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs