ఒకే ఒక్క కన్ను గీటుతోనే యావత్ ప్రజానీకాన్ని, మరీ ముఖ్యంగా యూత్‌ని ఎంతగానో ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఏకంగా స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నుంచి సిద్దార్ద్, బాలీవుడ్ సీనియర్ లెజెండ్ అయిన రిషికపూర్ కూడా తన జనరేషన్‌లో ఆమె ఎందుకు పుట్టలేదని అడిగేంతగా తన క్రేజ్‌ని వ్యాప్తి చేసుకుంది. ఈమె నటిస్తున్న మలయాళ చిత్రం 'ఒరు ఆధార్ లవ్'లో ఈమె మెయిన్ హీరోయిన్ కూడా కాదు. కానీ ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఆమె మీదనే టీజర్, పాటని యూనిట్ విడుదల చేసింది.
ఇక ఈ చిత్రంలోని ఆ పాట ద్వారా ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలో కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రియా వారియర్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది. తమ చిత్రం యూనిట్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని, ఈ విషయంలో త్వరగా తీర్పునిచ్చి, ఈ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని కోరింది. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత వచ్చే రిజల్ట్‌ని బట్టే తర్వాతి సినిమాలను, రెమ్యూనరేషన్‌ని డిసైడ్ చేస్తానని అంటున్న ఆమె వరుస అవకాశాలు వచ్చినా నో చెబుతోంది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, తనకు షారుఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, సిద్దార్ద్ మల్హోత్రాలంటే ఇష్టమని, వారి చిత్రాలలో అవకాశం వస్తే సంతోషంగా ఒప్పుకుంటానని చెబుతోంది.
ఒకవైపు దీపికా పదుకొనే లవర్ తనకి ఇష్టం అంటూనే, తనకి హీరోయిన్లలో దీపికా కూడా పిచ్చి ఇష్టమని చెప్పుకొచ్చింది. మరోవైపు 'ఒరు ఆధార్ లవ్'లోని పాటకి ఏకంగా 80లక్షల వ్యూస్ వచ్చాయి. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో సన్నిలియోన్ కంటే ఈమె గురించి శోధన చేసే వారే ఎక్కువగా ఉండగా, ఈమెకి కేవలం షార్ట్ పిరియడ్‌లోనే ఫేస్‌బుక్‌లో 45వేల ఫాలోయర్స్ ఉండటం విశేషం.