గత నాలుగేళ్లగా ఈ టీవీ లో వస్తున్న జబర్దస్ అనే కామెడీ షో పుణ్యమా అని అనేకమంది కమెడియన్స్ వెండితెర మీద బుల్లితెర మీద రాజ్యమేలుతూ టాప్ కమెడియన్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఆ జబర్దస్త్ షో ద్వారా అనేకమంది కమెడియన్స్ ఇంకా పుడుతూనే ఉన్నారు. అయితే జబర్దస్త్ షో ద్వారా ఒక్కసారిగా లైమ్ టైమ్ లో కొచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లు చాలా బిజీగా ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే ఎక్స్ట్రా జబర్దస్త్ లో తమ కామెడీని పండిస్తున్నారు. అయితే ఈ మధ్యన సుడిగాలి సుధీర్ బ్యాచ్ వేసే పంచ్ లు సరిగా పేలడం లేదు. వారు బెస్ట్ స్కిట్ అందుకుని కూడా చాలా రోజులైపోయింది.
అయితే జబర్దస్త్ లో తమ స్కిట్ లో పంచ్ లు పేలకపోవడానికి ప్రధాన కారణం టీమ్ వర్క్ లేకపోవడమే అని ఆ టీమ్ సభ్యుడైన గెటప్ శ్రీను చెబుతున్నమాట. గెటప్ శ్రీను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జబర్దస్త్ షో గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అందులో భాగంగా మీ టీమ్ నుండి ఈ మధ్యన బెస్ట్ అనిపించే స్కిట్ రాకపోవడానికి కారణం ఏమిటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను సమాధానం చెబుతూ.. అవును నిజమే.. మా మీద అటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలతో కొంతవరకూ నేను ఏకీభవిస్తున్నాను . మా విషయంలో ఏదీ లేకుండగా ఎవరూ పనిగట్టుకుని విమర్శించరు. ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తీసుకోవలసిందే.
ఇంతకీ మా స్కిట్ లో కామెడీ తగ్గడానికి కారణమేమిటంటే... సుధీర్ ఇప్పుడు నాలుగు షోలు చేస్తున్నాడు .. మరో వైపున సినిమాలు కూడా చేస్తున్నాడు. అలాగే రామ్ ప్రసాద్ విషయానికొస్తే కొన్ని సినిమాలకి కథలు రాస్తూ తను బిజీగా వున్నాడు. మరి నేను కూడా కొన్ని షోలు .. సినిమాలు చేస్తున్నాను. ఇలా ముగ్గురం బిజీ కావడం వలన.... ఒక స్కిట్ గురించి కూర్చుని కూలంకషంగా మాట్లాడుకునే అవకాశం ఉండటం లేదు. ఆ స్కిట్ ప్రిపేర్ అయ్యే సమయానికి ముగ్గురం మూడు చోట్ల ఉంటున్నాం. అందుకే మా టీమ్ ఇలా కాస్త వెనకబడానికి కారణం అని చెప్పడమే కాదు.. జబర్దస్త్ కోసం మేం కలిసి కష్టపడతాం అంటున్నాడు గెటప్ శ్రీను.