ప్రతి ఒక్కరు లైంగిక వేధింపులపై మాట్లాడి తాము కూడా వార్తల్లోకి ఎక్కాలని భావించేవారు. కానీ అలాంటి వారు చేయాల్సిన పని ఏమిటో 'హ్యారీ పోటర్' సిరీస్ ద్వారా పాపులర్ అయిన హాలీవుడ్ నటి ఎమ్మావాట్సన్ నిరూపించింది. ఈమె లైంగిక బాధితులకు అండగా నిలబడింది. లైంగిక బాధితుల సహాయార్ధం ప్రారంభించిన 'యూకే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్'కి తనవంతుగా మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 9కోట్ల పైచిలుకు మొత్తాన్ని విరాళమిచ్చింది. వర్క్‌ంగ్ ప్రదేశాలలో అంటే పని చేసే ప్రదేశాలలో లైంగిక వేదింపులకు స్వస్తి పలకాలంటూ 200 మందికి పైగా బ్రిటిష్, ఐరిష్ నటీమణులు బహరింగ లేఖ రాసి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వారు లైంగిక బాదితులకు సహాయార్ధం ఈ-క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్న నటీమణులు ఎందరో ఉండగా, విరాళం ఇచ్చిన మొదటి దాతగా ఎమ్మా వాట్సన్ నిలిచింది. దీనిపై ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పేదలు, ఇతర ఆర్ధిక స్థోమత లేని మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులపై పోరాటం చేసేందుకు న్యాయ సహాయం నుంచి ఇతర సహాయాలను వీరి నుంచి లభించనుండటం గమనార్హం.