Advertisement
Google Ads BL

సమంత 'యూటర్న్‌' హడావుడి స్టార్ట్..!


నటనానుభవం, పేరు ప్రఖ్యాతులు, వయసు, పెళ్లి తర్వాత సాధారణంగా హీరోయిన్లు తమకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనే నటించాలని, తమ భుజస్కంధాలపై నడిచే చిత్రాలలో నటించాలని ఎక్కువగా కోరుకుంటారు. అంటే లేడీఓరియంటెడ్‌ చిత్రాలలో మెప్పించగలిగిన మెచ్యూరిటీ తమకు వచ్చినట్లు వారు భావిస్తారు. ఇక సమంత పెళ్లి కాకముందే కమర్షియల్‌ హీరోయిన్‌గా టాప్‌స్టార్‌గా వెలిగింది. పెళ్లి తర్వాత 'రాజు గారి గది 2' చిత్రం ప్రమోషన్‌ సందర్భంగా గతంలో నటించిన కొన్ని చిత్రాలను చూస్తే వాటిల్లో తాను ఎందుకు నటించానా? అని బాధపడతానని ఇక నుంచి మాత్రం మంచి పాత్రలైతే తప్ప చేయనని చెప్పింది. అన్నట్లుగానే సుకుమార్‌, రామ్‌చరణ్‌లతో చేస్తున్న 'రంగస్థలం 1985', 'మహానటి' వంటి చిత్రాలలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు సమంత మరో పెద్ద అడుగు ముందుకేసింది. రెండేళ్లకిందట కన్నడలో శ్రద్దాశ్రీనాధ్‌, రాధికా చేతన్‌, దిలీప్‌రాజ్‌లు ముఖ్యపాత్రలో పవన్‌ కుమార్ అనే కొత్త దర్శకుడు తీసిన 'యూటర్న్‌' ఘన విజయం సాదించింది. ఇదో విభిన్నమైన థ్రిల్లర్‌ కథ, సమంత, చైతుల వివాహం జరగకముందే వీరు బెంగుళూరు వెళ్లి ఈ చిత్ర నిర్మాతలతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చాలా కాలం గ్యాప్‌ రావడంతో సమంత ఆ చిత్రం నుంచి డ్రాప్‌ అయిందా? అనే అనుమానాలు వచ్చాయి. కానీ తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ని కూడా సమంత రాజమండ్రిలో ప్రారంభించింది. 'రంగస్థలం, మహానటి' చిత్రాలలో తన పాత్రల షూటింగ్‌ పూర్తి కావడంతో ఈమె ఈ చిత్రాన్ని వెంటనే ప్రారంభించింది. దీనికి కన్నడ ఒరిజినల్‌ దర్శకుడు పవన్‌కుమారే దర్శకత్వం వహిస్తుండగా, ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుంది. 

ఇక ఇందులో రాహుల్‌ రవీంద్రన్‌, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని స్వయంగా సమంత, నాగచైతన్యలు కలిసి నిర్మిస్తున్నారు. సమంత వచ్చిందని తెలిసి జనాలు రాజమండ్రిలో తరలి వచ్చి కోలాహలం చేశారు. దాని వీడియోను సమంత పోస్ట్‌ చేసి, అభిమానుల ప్రేమ మరింత ఉత్సాహాన్ని, చిత్రాన్ని ఇంకా బాగా తీయాలనే ప్రేరణను కలిగిస్తున్నాయని పేర్కొంది.

Samantha Hulchal with U Turn:

Samantha U Turn movie Shooting Starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs