శంకర్ 'ఐ' చిత్రంతో పాపులర్ అయిన లండన్ బ్యూటీ అమీ జాక్సన్... తెలుగులో ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన మెరిసింది. కానీ ఈ లండన్ అందాలు చూడడానికి తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే అమ్మడు మళ్ళీ కోలీవుడ్ కి చెక్కేసింది. అయితే మళ్ళీ రజినీకాంత్ '2 .0' సినిమాతో రోబో గర్ల్ గా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని రెచ్చకొడుతుంది. మరి హాట్ గ్లామర్ షోతో రెచ్చిపోతున్న అమీ జాక్సన్ ఇప్పుడు తాజాగా ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అమీ జాక్సన్ లవ్ లో పడడమే కాదు.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొడుతుందని కూడా ప్రచారం మొదలైపోయింది. మరి ఆ వార్తలు నిజమే అన్నట్టుగా ఈ లండన్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మంచులో ఆటలాడుకుంటున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచు కొండల్లో స్కేటింగ్ చేస్తూ ఇద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అయ్యాయి. మరి ఈ అందాల హాట్ సుందరి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడుతుందో లేదో తెలియదు గాని అమీ ఇప్పుడు '2 .0' కన్నా ఎక్కువగా ఈ లవ్ విషయంలో పాపులర్ అయ్యేలాగే కనబడుతుంది.
మొన్నామధ్యన సౌత్ భామ ఇలియానా కూడా సినిమాల కన్నా ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ అయిన ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకుని రోజుకో ఫొటోతో బాగా పాపులర్ అయ్యింది. మరి వారు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే న్యూస్ కూడా వుంది. మరి అమీ అయినా తన లవ్ ని బయటపెడుతుందో లేదంటే... సీక్రెట్ గా ఉంచుతుందో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.