ముందు ఎవరికైనా సలహాలు ఇచ్చే ముందు మన ఇంటిని మనం బాగుచేసుకోవాలి. ఎవరికో సలహా ఇచ్చేటప్పుడు తమలో ఆ లోపాలు లేవా? అనేది ఆలోచించాలి. లేకపోతే నీతులు మనకి కాదు.. ఎదుటి వారికి చెప్పేందుకే అనే చెడ్డపేరు వస్తుంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు' చిత్రాలతో తెలుగులో హీరో సిద్దార్ద్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారి లవర్‌బోయ్‌గా భారీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్స్ అందుకోవడంలో విఫలమై తెలుగు ప్రేక్షకులను కించపరిచి తన సొంత గూటికి అంటే కోలీవుడ్‌కి వెళ్లిపోయాడు. ఇటీవల వచ్చిన 'గృహం' చిత్రంతో ఫర్వాలేదనిపించాడు. తనకు వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకోవడంలో సిద్దార్ద్ ఫెయిలయ్యాడనే చెప్పవచ్చు.
ఈయన ప్రస్తుతం దేశాన్ని ఓ ఊపు ఊపుతోన్న ప్రియా వారియర్‌కి అద్భుతమైన సలహా ఇచ్చాడు. ప్రియా హవా కేవలం సీజనల్‌గా మారకూడదని, తనకు వచ్చిన స్టార్‌డమ్‌ని ఆమె కాపాడుకోవాలని సూచించాడు. క్రేజ్ కనుమరుగయ్యేలా చేసుకోవద్దని, నిలకడగా పర్‌ఫార్మెన్స్ చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలని సూచించాడు. ఇక ఈయన ఈమెను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరపున 2011లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఐపిఎల్‌లో సంచలనాలు సృష్టించిన పాల్ వాల్తాటితో పోల్చాడు. ఈయన 2011లో అద్భుతంగా రాణించినా కూడా తర్వాత నిలకడ లేక రెండు మూడు సీజన్లకే పరిమితం అయ్యాడు.
ఇప్పుడు అతడిని కొనుగోలు చేసేందుకు ఓ ఫ్రాంచైజీ కూడా ముందుకు రావడం లేదు. ప్రియా వారియర్ వాల్తాటిలా ఒక సీజన్‌కే పరిమితం కాకూడని, స్ధిరమైన ప్రతిభను ప్రదర్శించాలని చెబుతూ, ఆమెకి బెస్టాఫ్‌లక్ చెప్పాడు. మరి సిద్దార్ద్‌ది కూడా అదే పరిస్థితి కదా...! మరి ఆయన తన స్వీయ అనుభవంతోనే ఇలా చెప్పాడనే సెటైర్లు బాగానే వినిపిస్తున్నాయి.