Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ చేయడం లేదు.. మరి ఎవరు?


బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి పాకిన బిగ్ బాస్ షో తెలుగులో బాగా క్లిక్ అయింది. సీజన్ -1కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తి కట్టించాడు. సీజన్ - 1కు మంచి రెస్పాన్స్  రావడంతో.. నిర్వాహకులు సీజన్ - 2ను స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు.

Advertisement
CJ Advs

పోయిన సారిలా కాకుండా ఈ సారి షోను మరింత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాలని.. బాగా ఫేమస్ ఆర్టిస్ట్స్ ను పెడదాం అని అనుకుంటున్నారు. అయితే సీజన్ - 2 కూడా వ్యాఖ్యాతగా హీరో జూనియర్ ఎన్టీఆర్ నే అనుకున్నారు అంత. కానీ ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించట్లేదు.

అవును.. త్రివిక్రమ్.. రాజమౌళి సినిమాలు వెంట వెంటనే ఉండటం వల్లన డేట్స్ ఇబ్బంది కారణంగా ఎన్టీఆర్ ఈ సీజన్ నుండి తప్పుకుంటున్నట్టు, తనకు కుదరదని చెప్పేశారు. మరి, వ్యాఖ్యాతగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానిని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సో దీనికి నానిఏ కరెక్ట్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనికి నాని ఒకే అంటాడో లేదో చూడాలి.

Bigg Boss Telugu Season 2 to have a New Host, Nani to replace Jr.NTR:

Jr NTR not to return for season two of Bigg Boss Telugu, Nani to be the next host?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs