Advertisement
Google Ads BL

అర్జున్‌రెడ్డి వాళ్ళ అమ్మకి అదిరిపోయే రెస్పాన్స్‌!


సినిమా ఫీల్డ్‌లో కొంత మంది తమ కుటుంబ సభ్యులు, పిల్లలను ఎవ్వరికీ చెప్పకుండా వారి ప్రైవసీని కాపాడుతూ ఉంటారు. ఉదాహరణకు వెంకటేష్‌ భార్య, పిల్లలు, సమంత తల్లిదండ్రులు, నాని తల్లిదండ్రులు, రవితేజ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ కొందరు మాత్రం తమ భర్తలు, కొడుకు కూతుర్లకి వచ్చిన సెలబ్రిటీ హోదాలను తాము కూడా అనుభవిస్తారు. ఈ విషయంలో ఎవరి నిర్ణయం వారిది. ఇక విషయానికి వస్తే 'పెళ్లిచూపులు' వంటి హిట్‌ ఉన్నా కూడా 'అర్జున్‌రెడ్డి' చిత్రం యూత్‌లో విజయ్‌ దేవరకొండని ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. ఆయన్ని ఇష్టపడని యూత్‌ లేదు. మరీ హీరోయిజం చూపించకుండా, తనదైన మన పక్కింటి అబ్బాయి టైప్‌లో ఆయన చేసిన నటనకు అందరు ఫిదా అయ్యారు. దీని తర్వాత ఆయనకు ఎక్కడలేని చాన్స్‌లు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈయన తల్లిపేరు మాధవి. స్పీక్‌ ఈజీ సంస్థను స్థాపించిన మంచి మోటివేట్‌ స్పీకర్‌ ఆమె. బహుశా 'అర్జున్‌రెడ్డి' చిత్రం సందర్భంలో విజయ్‌ మాటలు ఆమె తల్లి స్ఫూర్తిగానే వచ్చి ఉండవచ్చు. ఈమె తాజాగా ఓ మహిళా కళాశాలలో జరిగే వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైంది. అక్కడి మహిళలు, కాలేజీ విద్యార్థినులు.. ఇలా అందరి నుంచి ఆమెకి అపూర్వమైన స్వాగతం లభించింది. కొందరైతే మాధవిలో ఆమె కుమారుడు విజయ్‌ దేవరకొండని చూసుకున్నామని వ్యాఖ్యానించడం విశేషం. 

ఈ వేడుకకు విజయ్‌ హాజరైతే ఎంత రెస్పాన్స్‌ వస్తుందో ఆమె తల్లికి కూడా అంతే రెస్పాన్స్‌ రావడం విశేషం. దీంతో విజయ్‌ దేవరకొండ కూడా ఎంతో హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి, నటునిగా ఇది నాకు బెస్ట్‌ అండ్‌ మెమరబుల్‌ మూమెంట్‌. మీ ప్రేమను నేను ఆస్వాదిస్తున్నానని చెప్పి ట్వీట్‌ చేశాడు.

Even Arjun Reddy'Mother Is Highly Popular:

Yesterday Mummylu visited Reddy Women's College :)  This is the BEST thing I have seen since I became an actor. I feel your love. I feel it in me... Tweeted Vijay Devarakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs