Advertisement
Google Ads BL

పెళ్లి అంటే ఈ హీరోకి బూతులా ఉందా?

tarun,angry,marriage question,tollywood | పెళ్లి అంటే ఈ హీరోకి బూతులా ఉందా?

స్టార్స్‌ విషయాలకి వస్తే వారితో ఇంటర్వ్యూలు, చిట్‌ చాట్‌ల వల్ల టీఆర్పీలు, సర్క్యులేషన్‌ను పెరుగుతాయనే మాట వాస్తవమే. కాబట్టి టాప్‌స్టార్‌ ఇంటర్వ్యూల కోసం మీడియా కూడా ఉత్సాహం చూపుతుంది. కానీ కొందరు హీరోలు ఉంటారు. వారిచ్చే ఇంటర్వ్యూలను ఎవ్వరూ చూడరు. టైం వేస్ట్‌ వ్యవహారం. వారి వల్ల ఆయా మీడియా సంస్థలకి లభించేది ఏమీ ఉండదు. కానీ హీరో కదా..! అందునా ఒకప్పుడు పాపం బాగా వెలిగిన వాడు అని వారి చిత్రాలు విడుదలైనప్పుడు వారితో కూడా ఇంటర్వ్యూలు చేస్తారు. గతంలో మంచు విష్ణు, మంచు మనోజ్‌ల సినిమాల విడుదల సందర్భంగా కొందరు ఇంటర్వ్యూలు చేద్దామని భావిస్తే మోహన్‌బాబు మా పిల్లల ఫొటోలను కవర్‌పేజీల మీద వేస్తేనే ఇంటర్వ్యూలు ఇస్తారు అని చెప్పాడు. దాంతో వారికంత సీన్‌ లేదని మీడియా కామ్‌ అయిపోయింది. 

Advertisement
CJ Advs

వారి ఇంటర్వ్యూలు వేసి ఏదో మీడియా బాగుపడి పోతున్నట్లు వారి శైలి ఉంటుంది. ఈ కేటగరీలోకి నేడు సినిమాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న తరుణ్‌ కూడా చేరిపోయాడు. ఈయన విజయం మొహం చూసి ఎంత కాలం గడిచిందో అందరికీ తెలిసిందే. ఏదో 'నువ్వేకావాలి, నీ మనసు నాకు తెలుసు, నువ్వే.. నువ్వే' చిత్రాలతోనే అంతమైంది. ఆ తర్వాత ఆర్తిఅగర్వాల్‌ విషయంలో వార్తల్లో నిలిచాడు. ఇక ఈయన నటించిన 'ఇది నా లవ్‌స్టోరీ'ని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీగా మిగిలింది. వేలలో తప్పితే కలెక్షన్లు రాలేదు. ఆ వేలు కూడా కేవలం తమిళ బిగ్‌బాస్‌ సంచలనం ఓవియా వల్లే వచ్చాయి. 

ఈయన్ని తాజాగా ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తూ రొటీన్‌గా అడిగే మీపెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించింది. దానికి 35 ఏళ్ల వయసు దాటిన ఈ ఓల్డ్‌ లవర్‌బోయ్‌ అసహనం వ్యక్తం చేస్తూ.. చేసుకుంటా... తొందరేంటి? అంటూ ఏదో బూతు ప్రశ్న అడిగినట్లు విరుచుకు పడ్డాడు. అంతటితో ఆగకుండా నేనేం దొంగతనంగా పెళ్లి చేసుకోను. కంగారు పడకండి.. అందరికీ చెప్పే చేసుకుంటా అంటూ మాట్లాడటంతో ఆశ్యర్యపోవడం మీడియా వంతైంది.

Hero Tarun Response On Marriage:

Tollywood Hero Tarun angry on Marriage Question
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs