Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ పై జోక్ పేల్చిన చిరు..!


కొందరు తాము ఎవరి ముందు తలవంచం అని చెబుతుంటారు. అది మిగిలిని విషయాలలో. కానీ కొన్నిసార్లు వారు తలవంచాల్సి వస్తుంది. ఇక విషయానికి వస్తే మిగిలిన మెగాహీరోల కంటే వరుణ్‌తేజ్‌ తన టేస్ట్‌ డిఫరెంట్‌ అని నిరూపించుకుంటున్నాడు. 'కంచె, ఫిదా' తర్వాత 'తొలి ప్రేమ' చేశాడు. ఇది బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం నిర్మాతకు, డిస్ట్రిబ్యూట్‌ చేసిన దిల్‌రాజుకి, బయ్యర్లకు కూడా భారీ లాభాలు తేవడం ఖాయం. రెండో వారంలో కూడా స్టడీగా దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రం మామూలు ప్రేమకథే అయినా దర్శకుడు వెంకీ అట్లూరి సీన్‌ బై సీన్‌ రాసుకున్న విధానం మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం విజయం వెనుక టీం మొత్తం కృషి ఉంది. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి ఈ చిత్రం టీమ్‌ని తన ఇంటికి ఆహ్వానించి వారిని సత్కరించాడు. అందరికీ శ్శాలువాలు కప్పాడు. ఇక చిరంజీవిలో సెన్సాఫ్‌ హ్యూమర్‌, స్పాంటేనియస్‌, హాస్యచతురత ఎంతగా ఉంటుందో గతంలో ఎన్నో వేడుకలు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూలో తెలిసిన విషయమే. అదే స్పాంటేనియస్‌ని చిరు ఈ వేడుకలో కూడా చూపించాడు. వరుణ్‌తేజ్‌కి శాలువా కప్పే సమయంలో 'వరుణ్‌కి శాలువా కప్పాలంటే నేను కుర్చీ ఎక్కాలేమో' అని హ్యాస్యోక్తి విసిరాడు. 

దాంతో అందరిలో నవ్వులు విరబూశాయి. చివరకు వరుణ్‌తేజ్‌ కూడా నవ్వాపుకోలేకపోయాడు. నిజమే.. వరుణ్‌ ఎత్తు 6.4 అడుగులు. చిరంజీవి హైట్‌ 5.8 అడుగులు, అంతేకాదు వరుణ్‌ ప్రభాస్‌ కంటే కూడా ఓ అడుగు ఎక్కువే. దాంతో ఈ చిరు జోక్‌ బాగా పేలింది.

Chiranjeevi Making Fun on Varun Tej Height:

Chiranjeevi Funny Comments on Varun Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs