Advertisement
Google Ads BL

భాగమతి.. భానుమతిగా మారితే..?


టాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించున్న దేవసేన అనుష్కకి ఇప్పుడు మరో అద్భుత అవకాశం  తలుపు తట్టినట్టుగా చెబుతున్నారు. నిన్నగాక మొన్న 'భాగమతి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుష్క ఇదివరకే అరుంధతి, రుద్రమదేవి సినిమాల్లో లీడ్ రోల్స్ లో మెప్పించింది. అనుష్కకి అందంతో పాటు అభినయం కూడా మెయిన్ ప్లస్ పాయింట్. ఇక బాహుబలి దేవసేన పాత్రలో అనుష్క చేసిన యుద్ధ విన్యాసాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. కుంతల దేశపు యువరాణి దేవసేనగా అనుష్క పది కాలాలు గుర్తుండిపోయే పాత్రలో మెప్పించింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా అనుష్క మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న 'మహానటి' సినిమాలో అనుష్క అలనాటి నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి 'భానుమతి' పాత్రను అనుష్క పోషించనుందనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ కుమార్తెలు నిర్మిస్తున్న 'మహానటి' సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తుండగా... జర్నలిస్ట్ పాత్రని సమంత పోషిస్తుంది. అలాగే వివిధ పాత్రలను టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పోషిస్తుండగా.. ఇప్పుడు తాజాగా మహానటి సావిత్రి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన భానుమతి పాత్రను అనుష్క చేస్తుందని ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.

మరి అనతి కాలంలో సావిత్రి, భానుమతి పోటాపోటీగా సినిమాలు చేస్తూ గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. మరి అనుష్కకి భానుమతి పాత్ర ఆఫర్ అయితే వచ్చింది కానీ... దానికి అనుష్క ఒప్పుకుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే అనుష్క భాగమతి సినిమా తర్వాత ఎటువంటి సినిమాకి సైన్ చెయ్యకుండా ఖాళీగానే ఉంది.

Anushka turns Bhanumathi for Mahanati:

After Bhaagamathie Now Anushka Turns Bhanumathi &nbsp; <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs