Advertisement
Google Ads BL

బుల్లితెర హాట్‌బ్యూటీ అర్ధం చెప్పేసింది!


టీవీ యాంకర్‌గా అనసూయ, రేష్మిలతో పాటు శ్రీముఖికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈమె టీవీ షోలతో పాటు హోస్ట్‌గా 'పటాస్‌' వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇక ఈమె వెండితెరపై కూడా బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె 'అమృతం' సీరియల్‌ నటుడు, దర్శకుడు, 'ఇష్క్‌, మనం' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన హర్షవర్దన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. ఈమె వాలంటైన్స్‌డే సందర్భంగా తన చేతిపై ఓ టాటూని వేయించుకుంది. దానిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో అందరు ఆ టాటూ అర్ధం ఆమె బోయ్‌ఫ్రెండ్‌ పేరు అనే వార్త హల్‌ చల్‌ చేసింది. 

Advertisement
CJ Advs

కానీ ఈ విషయంలో శ్రీముఖి తొందరగానే అసలు విషయం బయటపెట్టింది. తాను అరబిక్‌ భాషలో హుబానఫ్సక్‌ అనే పేరును టాటూ వేయించుకున్నానని, దీని అర్ధం తెలుగులో ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అని అసలు విషయం తెలిపింది. తాను పుట్టనప్పటి నుంచి తానే తనకు ఫేవరేట్‌ అని, నేనంటే నాకెంతో ఇష్టం. గౌరవం అని తెలుపుకొచ్చింది. ఇలా తన టాటూ విషయంలో వస్తున్న పలు వార్తలకు ఆమె ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

Hot Anchor, Huba Nafsak Awla:

Srimukhi's Tattoo on V-Day becomes talking point
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs