టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఉన్నట్టుండి కాలం తిరగబడిందా అన్నట్టుగా అవకాశాలు లేకుండా పోయాయి. ఏదో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నాని చెప్పినా.. ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మరి అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే టాప్ హీరోయిన్ అయిపోయినట్లుగా బాలీవుడ్ లోను టాప్ పొజిషన్ కి వెళ్లాలని ఊహించుకుంది. ఎన్నడూ లేని విధంగా మ్యాగజైన్ లకు హాట్ ఫోటో షూట్స్ తో పాటు.. తాను నటించిన అయ్యరి సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేసింది.
రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో నటించిన అయ్యరి సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎంతో గ్రాండ్ గా ప్రమోట్ చేసి మరి విడుదల చేసిన అయ్యరి సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుని నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా ఆర్మీ ఆఫీసర్స్ జీవితమ్ నేపధ్యంలో తెరకెక్కింది. మరి ఈ సినిమా మొదటి షోకే డివైడ్ టాక్ తెచ్చుకుని రకుల్ ఆశల మీద భారీగా నీళ్లు చల్లేసింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడిగా నటించిన రకుల్ కి ఈ సినిమాలో లభించిన పాత్ర పెద్ద గొప్ప పాత్రేమీ కాదు. ఏదో బాలీవుడ్ లో చేశాను అని చెప్పుకోవడాని ఉపయోగపడుతుంది అని చేసినా ఎక్కడా తగ్గకుండా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది రకుల్.
అయితే ఎంతగా బాలీవుడ్ లో నిలబడాలని ట్రై చేసినా చివరికి రకుల్ కి నిరాశే మిగిలింది. అయితే డివైడ్ టాక్ తెచ్చుకున్న అయ్యరి స్టొరీ లైన్ బాగున్నప్పటికీ దాన్ని స్క్రీన్ ప్లే రూపంలో ఆసక్తికరంగా మలచడంలో నీరజ్ పాండే ఫెయిల్ అయ్యాడు. దాంతో రకుల్ బాలీవుడ్ ఆశలు కూడా ఫెయిల్ అయినట్లే కనబడుతున్నాయి.