Advertisement
Google Ads BL

బిగ్ బాస్ పై వస్తున్న ఈ వార్త నిజమేనా?


ఎన్టీఆర్ క్రేజ్ వలన బిగ్ బాస్ 1  ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కేవలం ఎన్టీఆర్ వలనే  ఆ షోకి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందనేది ముక్తఖంఠంతో చెబుతారు అంతా. అంతలా ఎన్టీఆర్ రెండు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. మరి బిగ్ బాస్ సీజన్ 1 లో పెద్దగా ఫెమ్ లేని మొహాలను చూసి బోర్ కొట్టినా కేవలం ఎన్టీఆర్ ఉన్నాడనే ఒక్క విషయంలోనే ఆ షో బంపర్ హిట్ అయ్యింది. మరి అంతలా పాపులర్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే  మళ్లీ  ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ చేస్తాడని అందరూ ఫిక్స్ అవడమే.

Advertisement
CJ Advs

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిగ్ బాస్ షోని చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ ఒక న్యూస్ ఇప్పుడు మీడియాలో, వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి మొదటిసారి బుల్లితెర మీద అదిరిపోయే వ్యాఖ్యానం చేసి ది బెస్ట్ హోస్ట్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆ షో చెయ్యననడం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ ఏడాది రెండు సినిమాలకు కమిట్ అవడంతో బిగ్ బాస్ 2 కి టైం కేటాయించలేకపోవడం వలెనే ఎన్టీఆర్ ఈ షో చేయకపోవడానికి కారణమంటున్నారు.

ఒక సినిమా త్రివిక్రమ్ తో కమిట్ అవగా... ఆ సినిమా మార్చి నుండి మొదలయ్యే అవకాశం ఉండడం.. అలాగే రాజమౌళితో మల్టీస్టారర్ సినిమా కోసం రామ్ చరణ్ తో కలిసి నటించడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ చేస్తే టైం సెట్ కాదని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. మరి ఆ సినిమాల కోసం ఫిట్నెస్ ఇలా అన్ని విషయాల్లోనూ సిద్ధంగా ఉండాలి. మరి ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో కోసం 14 వారాల పాటు టైం కేటాయించడం సాధ్యమయ్యే పనికాదని ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ నుండి డ్రాప్ అయ్యాడని అంటున్నారు. మరి ఈ న్యూస్ అధికారికముగా బయటకు రానప్పటికీ.... ఇది నిజమే అంటున్నారు.

NTR opts out of Bigg Boss:

NTR Needs A Replacement  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs