టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నాగార్జున - అమలల జంట ఎంత క్యూటెస్ట్ గా పాపులర్ అయ్యిందో... ఇప్పుడు నాగ్ కొడుకు నాగ చైతన్య ఆయన భార్య సమంత అంతే క్యూటెస్ట్ కపుల్ గా కనబడుతున్నారు. ఐదేళ్ల నుండి ప్రేమ, గత ఏడాది పెళ్లి ఇలా ఈ జంట విపరీతంగా పాపులర్ అయ్యింది. ఎనిమిదేళ్ల క్రితం ఏ మాయ చేసావే తో మొదలైన వీరిద్దరి స్నేహం నిన్నమొన్నటి ప్రేమ, పెళ్లి వరకు అద్భుతంగానే సాగింది. మరి గతంలో ఏమాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో కనబడిన ఈ అందమైన ప్రేమికులు ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారు. శివ నిర్వాణం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మాణంలో కలిసి పనిచెయ్యబోతున్నారు.
మరి అధికారికంగా ఈ వార్త బయటికి రానప్పటికీ నాగ చైతన్య - సమంతలు కలిసి నటించడం మాత్రం ఫిక్స్. మరి ప్రేమలో ఉన్నప్పుడు ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడిన ఈ ప్రేమ జంట చివర్లో మీడియాకి చిక్కాక కూడా ఎంతో గుంబనంగానే ఉన్నారు. అలాగే పెళ్లిని కూడా ఎక్కడో దూరంగా గోవాలో కుటుంబ సభ్యుల మధ్యన చేసుకున్న వీరి జంటకి మాత్రం విపరీతమైన పాపులారిటీ ఉంది. అలాంటి ఈ జంట గతంలో పెళ్లి కాకమునుపు నటించడం వేరు.... ఇప్పుడు స్వీట్ కపుల్ గా మారినాక మళ్లీ కలిసి నటించడం వేరు. మరి చైతు, సమంతలు ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తారో.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అటు అక్కినేని అభిమానులు ఇటు సాధారణ ప్రేక్షకులు సైతం కాచుకుని కూర్చున్నారు.
మరి పెళ్లి పేరుతో ఇంత పాపులర్ అయిన ఈ జంట ఇప్పుడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటించాలంటే ఎంత పారితోషకం డిమాండ్ చేస్తారో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఒకవేళ సమంత - నాగ చైతన్య కలిసి నటించడమంటే నిర్మాతలు కోట్లు కుమ్మరించాల్సి వస్తుందేమో. ఎందుకంటే సమంత ప్రస్తుతం పెళ్లి తర్వాత కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. అటు నాగ చైతన్య కు కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించబోయే సినిమా కోసం కోట్లు అడిగారని గ్యారెంటీ లేదు. మరి ఆఫ్ స్క్రీన్ లో వీరి ప్రేమను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలుపుతూనే ఉంది. మరి ఆన్ స్క్రీన్ లో వీరితో రొమాన్స్ చేయించడం కోసం నిర్మాతలు ఎంతైనా ఇచ్చేస్తారంటున్నారు. చూద్దాం ఎప్పటినుండో అంటే పెళ్లి తర్వాత చైతు - సామ్ లు కలిసి నటించబోయే సినిమా తాలుకు అప్ డేట్స్ ఎలా వుంటాయో..?