Advertisement
Google Ads BL

ప్రియా.. బన్నీకి పడిపోయింది..!


కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే దేశంలోని కుర్రకారు మతులను పోగొట్టిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తాను ఓర చూపులు చూస్తూ, కన్ను కొట్టితేనే ఏకంగా రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయింది. అయితే ఈ 18ఏళ్ల టీనేజ్‌ గర్ల్‌ మాత్రం కేవలం ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సాధించడం ముఖ్యమే గానీ దానిని నిలబెట్టుకోవడం, మరింతగా ఆ పాపులారిటీని పెంచుకోవడం, తనదైన శైలిలో మిగిలిన వారిని కూడా తన ముగ్గులోకి దించడం కూడా ముఖ్యమేనని భావిస్తూ, మాటలతో కూడా తన లౌక్యం చూపుతోంది. ఆల్‌రెడీ పెళ్లయిన ఇండియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ధోనిని తన ఫేవరేట్‌గా చెప్పడంతో సినిమాలు చూడని క్రికెట్‌ ప్రేమికులు కూడా ఈమె వైపు చూపు సారిస్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఎంతో క్రేజ్‌ ఉన్న అల్లుఅర్జున్‌ ఉరఫ్‌ మల్లూ అర్జున్‌ని కూడా కాకా పట్టేస్తోంది. 

Advertisement
CJ Advs

ఆమె తాజాగా మాట్లాడుతూ, తన ఎక్స్‌ప్రెషన్స్‌ని అల్లుఅర్జున్‌ కూడా ఎంతో మెచ్చుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. తనకు ప్రేక్షకులు ఇచ్చిన ప్రశంసలు ఎంతో సంతోషాన్ని అందిస్తూన్నా కూడా అల్లుఅర్జున్‌ ప్రశంస మాత్రం తనకెంతో ప్రత్యేకమని చెబుతోంది. ఇలా ఈమె బన్నీని కాకా పడుతున్న తీరు చూస్తుంటే మాలీవుడ్‌లోని బన్నీ అభిమానులతో పాటు ఆయన్ను కూడా మెప్పించేలా మాట్లాడింది. ఇక ఎప్పటి నుంచో అల్లుఅర్జున్‌ తెలుగుతో పాటు మలయాళంలో కూడా స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నానని, తనకు మంచి కథలు చెప్పే దర్శకుల కోసం చూస్తున్నానని చెప్పి, కేవలం మలయాళీల కోసమే వారి పంచె కట్టులో కనిపిస్తానని అంటూ వస్తున్నాడు. 

మరి అందులో ఈమెకేమైనా ఛాన్స్‌ ఇస్తాడేమో చూడాలి. మరోవైపు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ బన్నీపై పొగడ్తల వర్షం కురిపించడం ద్వారా తాను ప్రస్తుతం నటిస్తున్న 'ఒరు ఆధార్‌ లవ్' చిత్రం విషయంలో కూడా లబ్దిపొందాలని చూస్తోంది. ఈ చిత్రం డబ్బింగ్‌ హక్కులను తెలుగు నిర్మాతలు భారీ ధర చెబుతున్నా దానిని చేజిక్కించుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇదే చిత్రం కనుక తెలుగులో విడుదలైతే ఆమెకి బన్నీ నుంచే కాదు ఆయన అభిమానుల నుంచి కూడా బాగానే రెస్పాన్స్‌ రావడం ఖాయమంటున్నారు. 

Is This A Bunny's Trap?:

Priya Varrier over the moon with Bunny  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs