'అర్జున్ రెడ్డి' సినిమాతో హీరో విజయ్ దేవరకొండ లైఫ్ మారిపోయింది. హీరోయిన్ షాలిని పాండేయ్ సినిమాలు మీద సినిమాలు తీస్తూ బిజీ అయిపోయింది. ఇక డైరెక్టర్ సందీప్ వంగా ఈ సినిమాతో అటు యూత్ ని.. ఇటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.
ఆయన నెక్స్ట్ మూవీ ఎవరితో అని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. అయితే సందీప్ తో మూవీ చేయటానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. సందీప్ చెప్పిన కథ మహేష్ బాగా నచ్చిందని టాక్. ఈ సినిమాలో మహేష్ మెకానిక్ గా కనిపించనున్నాడు అని సమాచారం. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. యూత్ తో పాటు ఫ్యామిలీని కూడా ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయట.
మహేష్ ప్రస్తుతం 'భరత్ అనే నేను'లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాను పూర్తి చేసేసి, వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడని అంటున్నారు. అయితే అఫీషియల్ గా ఈ సినిమాకు సంబంధించి వివరాలు తెలియాల్సివుంది.