బాలకృష్ణది ఓ డిఫరెంట్‌స్టైల్. ఆయనది ఎప్పుడు మా నాన్న నేతులు తాగాడు.. నా మూతి వాసన చూడమనే రకం. కోటశ్రీనివాసరావు, చలపతిరావు వంటివారు కూడా బాలయ్య దేనికి పనికి రాడని, పాత ఎన్టీఆర్‌కి పది కిలోమీటర్ల లోపు వచ్చే స్థాయి ఆయనది కాదని కామెంట్ చేశారు. ఇక కోట అయితే బాలయ్య ఎంత సేపు షూటింగ్‌లో తన తండ్రి గురించి చెప్పుకోవడం, పొగుడుకోవడం తప్ప అతనికి మాట్లాడటం కూడా రాదని తేల్చేశాడు. ఇక ఈయన హిందుపురం నుంచి ఎంపికైనా వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే నిలబడాలా? లేక తమ స్వస్థలమైన కృష్ణాజిల్లాలోని ఏదైనా నియోజకవర్గం ఎంచుకోవాలా? అనే డైలమాలో ఉన్నాడు. ఈయనకు సమస్యలను వివరించడానికి వచ్చిన హిందుపురం ఓటర్లను తిట్టడం, అక్కడి స్థానిక నాయకుడిని కొట్టబోవడం, ఆయన పీఏ అంతా తానే కావడంతో ఆయనంటే అక్కడ సామాన్య ఓటర్లకే కాదు, స్థానిక టిడిపి నాయకులకు కూడా ఆయనంటే పడటం లేదు.
ఇక కిందటి ఎన్నికల్లో పవన్ చేత తిప్పించుకుని చంద్రబాబు, టిడిపి బాగానే లబ్దిని పొందాయి. ఈ విషయాన్ని ఉండవల్లి నుంచి ముద్రగడ వరకు అందరు చెప్పారు. మరి నాటి ఎన్నికల ప్రచార సభలో పవన్‌ని కాదని, చంద్రబాబు, మోడీలతో బాలయ్య ప్రచారం చేస్తే సరిపోయేది కదా..! అయినా బాలయ్య ఒక్కరోజు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం చేస్తేనే ఏ స్థాయిలో రచ్చజరిగిందో.. పార్టీకి ఎంత డామేజ్ అయిందో చంద్రబాబుకి తెలుసు. ఇక తాజాగా బాలయ్య పవన్‌పై మరో కామెంట్ చేశాడు. వైజాగ్ బీచ్‌లో టీఎస్సార్ ఏర్పాటు చేసిన మహాశివరాత్రి వేడుకకు హాజరై కారు ఎక్కుతుంటే జర్నలిస్ట్‌లు ప్రత్యేక హోదా కావాలని పవన్ అంటున్నాడు కదా..! అని ప్రశ్నిస్తే.. పవన్ కళ్యాణా.. ఆ పేరు ఎప్పుడు వినలేదే అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇదే నిజమైతే మిగిలిని టీడీపీ నాయకులకు పవన్ విషయంలో కాస్త మెత్తగా ఉండండి అని చెబుతోన్న చంద్రబాబు ముందుగా ఆ విషయం బాలయ్యకి చెబితే బాగుంటుంది. ఇక పవన్ అనంతపురంని టార్గెట్ చేయడం, అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పిన నేపధ్యంలో ఇరిటేషన్‌కులోనై బాలయ్య ఇలా వ్యాఖ్యానించాడని అంటున్నారు. అసలు నాడు మతిస్థిమితం లేదని సర్టిఫికేట్ తెప్పించుకుని కాకర్ల సుబ్బారావు పుణ్యమా అని కేసులోంచి బయటపడిన బాలయ్య తనకు తానే 'నేను నాకు తెలుసా' అని ప్రశ్నించుకోవడం అవసరం.