Advertisement
Google Ads BL

రకుల్‌ తీరుపై మండిపడుతున్నారు!


కిందటి ఏడాది వచ్చిన 'రారండోయ్‌ వేడుకచూద్దాం' చిత్రం తర్వాత రకుల్‌ప్రీత్‌సింగ్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ వంటి అద్భుత కాంబినేషన్‌లో చేసిన 'స్పైడర్‌' తెలుగు, తమిళ భాషల్లో కూడా డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆమె నటించిన 'జయజానకి నాయకా' కూడా హిట్‌ కాలేదు. అప్పటినుంచి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో తెలుగు చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదు. 'అయ్యారీ' అనే బాలీవుడ్‌ చిత్రం చేస్తూ దాని ప్రమోషన్స్‌ కోసం దేశమంతా తిరుగుతోంది. అదే తెలుగు వారు అడిగితే ఏదో అలా నామ్‌కే వాస్తే వచ్చి వెళ్లిపోతుందే గానీ కాలేజీలు, ఆర్మీక్యాంపులు, ఇలా ప్రతి చోటకి తిరగదు. అదేమంటే నయనతార విషయంలో మీకు లేని ఇబ్బంది నా విషయంలో ఎందుకు అనే అంటోంది. ఈ పంజాబీ భామ ప్రస్తుతం నటిస్తున్న 'అయ్యారీ' చిత్రంపై బోలెడు నమ్మకాలు పెట్టుకుంది. నీరజ్‌ పాండే దర్శకుడు కావడంతో కాస్త అంచనాలైతే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక తమిళంలో కార్తీ సరసన 'ఖాకీ' చిత్రంలో నటించి అక్కడ మరోసారి కార్తీ, ఆయన అన్నయ్య సూర్య, శివ కార్తికేయన్‌లతో మూడు చిత్రాలు ఒప్పుకుంది. బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ చిత్రంలో నటించనుంది దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకి టైం లేదంటోంది. బహుశా ఇలియానా, తాప్సిలా బాలీవుడ్‌లో మెరవాలంటే ఎక్స్‌పోజింగ్‌ అవసరం అని భావించిన ఆమె తెలుగులో ప్రతి దానికి నో చెబుతూ, బాలీవుడ్‌లో మాత్రం దేనికైనా రెడీ అంటోంది. 

తాజాగా మాగ్జిమ్‌ మేగజైన్‌కి హాట్‌ హాట్‌ స్టిల్స్‌ ఇవ్వడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇలాంటి మేగజైన్‌లో కనిపించాలని ప్రతి హీరోయిన్‌ కోరుకుంటుంది. కాబట్టే అలా సెక్సీగా కనిపించాను. అయినా నా తల్లిదండ్రులకు లేని అభ్యంతరం వీరికెందుకు? ఈ హాట్‌ ఫోటోషూట్స్‌ పట్ల కొందరు పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యారు. మరి కొందరు నెగటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. అయినా పొగిడితే ఉప్పొంగి పోవడం, తిడితే కృంగిపోవడం నా నైజం కాదు. నాకు నచ్చింది నేను చేస్తాను ఎవ్వరి మాటలు పట్టించుకోనని అంటున్న ఈ పంజాబీ బ్యూటీ తన హాట్‌ ఫొటోషూట్‌తో మరెన్ని బాలీవుడ్‌ ఆఫర్లు అందుకుంటుందో వేచిచూడాల్సివుంది.

Why Is Rakul Preet Trolled?:

Rakul Preet Singh angry with social media Sanskaris
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs