Advertisement
Google Ads BL

ఎక్స్‌ప్రెషన్స్‌ కే రెండు మూడు కోట్లా?


రెండు మూడురోజులుగా దేశంలోని యువత వాలంటైన్స్‌డే సందర్భంగా తమకిష్టమైన ప్రేమికురాళ్లను కూడా కాదని ప్రియా ప్రకాష్‌ వారియర్‌ వలలో పడిపోయారు. తాను నటిస్తున్న 'ఒరు ఆదార్‌ లవ్‌' చిత్రంలోని కొన్ని లుక్స్‌ , కేవలం తన కనుబొమ్మలతో ఆమె మాయచేసి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి అతి తక్కువ సమయంలోనే రెండు మిలియన్స్‌ ఫాలోయర్స్‌ని సాధించింది. ఇక గత రెండు మూడు రోజులుగా గూగుల్‌ ఇంజన్‌లో అత్యధికంగా శోధిస్తున్న వారిలో టాప్‌ ప్లేస్‌ని ఈమె సాధించింది. 

Advertisement
CJ Advs

ఎంతలా అంటే ఇండియన్స్‌ని తన మైకంతో, విచ్చలవిడి యాంగిల్స్‌, అన్ని చూపించేలా దుస్తులు వేసుకునే పోర్న్‌ స్టార్‌ సన్నిలియోన్‌ కంటే ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ ఇవ్వకుండా కేవలం కనుబొమ్మలతోనే మైకంలో ముంచెత్తిన ఈ భామే టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. 'ఒరు ఆధార్‌ లవ్‌'లోని పాటలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ని హిప్నటైజ్‌ చేసి మంత్ర ముగ్దులని చేస్తున్నాయి. కేవలం ఒక పాటతోనే ఇంతలా దక్కుతున్న ఆదరణ చూసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఈ చిత్రంలో దర్శకుడు, తన సహనటుడు కొన్ని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అడిగితే సింగిల్‌ టేక్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చానని, దానికోసం నేను కష్టపడింది కూడా ఏమీ లేదని తెలిపింది. 

ఇక తాజాగా నిఖిల్‌ హీరోగా 'పెళ్లిచూపులు' ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమెని తీసుకోవాలని భావిస్తే వారియర్‌ డేట్స్‌ని కూడా చూస్తున్న ఈ చిత్ర దర్శకుడు ఒమర్‌లాలు ఆమె నటించాలంటే ఏకంగా రెండు కోట్లు డిమాండ్‌ చేశాడట. ఆమె రేటు కాస్త తగ్గిస్తే నిఖిల్‌తో పాటు పలువురు యంగ్‌ హీరోలు, మెగా యంగ్‌ హీరోల కన్ను కూడా ఆమెపై పడటం ఖాయం.

Priya Prakash Varrier Demands 2cr for Telugu Movie:

Priya Prakash Varrier Remuneration for Telugu Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs