Advertisement
Google Ads BL

'అ!' నిర్మాత విన్నవించుకుంది వింటారా?


హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని ఇప్పుడు నిర్మాతగా కూడా మారిపోయాడు. టాలీవుడ్ లోనే భారీ తారాగణంతో ఒక చక్కటి 'అ!' సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో తన గొంతు వినిపిస్తూ కనబడకుండా మ్యాజిక్ చేసిన నాని ఇప్పుడు 'అ!' సినిమా హిట్ కోసం తపిస్తున్నాడు. ఈ సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నాని  మీడియాకి అలాగే ప్రేక్షకులకు విన్నపాలు వినవలే.... అంటూ ఒక మెస్సేజ్ ని సోషల్ మీడియాలో పెట్టాడు.

Advertisement
CJ Advs

అదేమిటంటే.... యూఎస్ లో 'అ!' సినిమా ప్రీమియర్స్ ని ముందే అంటే... ఇక్కడ విడుదలకు ఒకరోజు ముందే వేసేస్తారు. మరి అలాగే 'అ!' సినిమా ప్రీమియర్స్ కూడా యూఎస్ లో నిన్న గురువారం రాత్రే పడ్డాయి. అయితే సినిమా చూసిన అందరికి నాని ఈ విధంగా విన్నపం చేసుకున్నాడు. అదేమిటంటే యూఎస్ లో 'అ!' సినిమాని వీక్షించిన అందరికి ఒక విన్నపం. కొన్ని సినిమాలకు టీజర్, ట్రైలర్‌లో కథ చెప్పెయ్యగలుగుతాం. ఆ సినిమాల మీద ప్రేక్షకుడికి ఒక క్లారిటీ ఉంటుంది. అలా చేయటం వల్ల సినిమాను బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. కానీ కొన్ని సినిమాలకు కథని ట్రైలర్ లో రివీల్ చేస్తూ ముందే చెప్పలేం. అందుకే 'అ!' సినిమా చూడబోయే మీడియా ఫ్రెండ్స్‌కు, ప్రేక్షకులకు నా విన్నపం ఏంటంటే.. సినిమా చూసిన తర్వాత మీ ఫేస్‌బుక్‌లో, రివ్యూస్‌లో, లైవ్ ట్వీట్స్‌లో, మెసెజ్‌ల్లో సినిమా బాగుందా? లేదా? అనేది షేర్ చెయ్యండి.

అలాగే సినిమా నచ్చిందో.. లేదో? కూడా చెప్పండి. చూడొచ్చా? చూడక్కర్లేదా? కూడా షేర్ చేసుకోండి. మీ జనరల్ ఫార్మేట్ అంతా ఫాలోకండి. అయితే ఒక సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను రివీల్ చేస్తే ఆ సినిమా చూసేవాళ్లకు కిక్‌ను, ఎంజాయ్‌మెంట్‌ను తగ్గించిన వాళ్లం అవుతాం. అలా చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ప్రయత్నం చేశాం. తెలుగులో కొత్త సినిమా రావాలని కోరుకునే వారందరికీ 'అ!' నచ్చుతుందని నమ్ముతున్నా.... థ్యాంక్యూ - అంటూ నాని ఒకే ఒక్క వీడియోలో తన విన్నపాన్ని అందరికి వినిపించేశాడు. మరి నాని చెప్పిన విషయాన్ని మీడియా వారు.. అలాగే ప్రేక్షకులు పాటిస్తారో లేదో చూడాలి.

Nani Humble Request to Review Writers about AWE:

Nani Request To Audience and Reviewers About Awe    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs